టీమిండియా మాజీ సారధి, వికెట్ కీపర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని రుజువు చేస్తూ ధోనీ అనేకసార్లు వికెట్ల వెనుక ఉండి సలహాలు, సూచనలు చేయడం అనేక సందర్భాల్లో చూశాం. ఇదే విషయాన్ని టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా మరోసారి ప్రస్తావించాడు. రైనా మాట్లాడుతూ.. ‘ధోనీ పేపర్ మీద కెప్టెన్ కాదు. గ్రౌండ్ లో మాత్రం విరాట్ కోహ్లీకి అతడే సారథి. ఇప్పటికీ ధోనీ పాత్ర అలాగే ఉందని అన్నారు.
వికెట్ల వెనుక నుంచే బౌలర్లతో మాట్లాడి ఫీల్డింగ్ మార్పులూ చేస్తాడని అన్నాడు. ధోని అందరిలా కెప్టెన్సీ నిర్వహించే సారధి కాదన్న రైనా.. ఓ వైపు బౌలర్లకు స్వేచ్చనిస్తూనే కీలక సమయాల్లో సూచనలు చేస్తాడని, అవి అనేక సందర్భాల్లో బౌలర్లకు కలసివచ్చాయన్నారు. అతను కెప్టెన్లకే కెప్టెన్ అని అన్నాడు. ధోనీ ఉంటే కోహ్లీకి కొండంత అండ అని చెప్పుకోచ్చాడు. క్లిష్ట సమయాల్లో వ్యూహాత్మకంగా ఆలోచించి మార్పులు చేస్తాడని.. అనేక సందర్భాల్లో ఈ విషయం తేలింది’ అని పేర్కొన్నాడు.
అయితే కోహ్లీ ఆత్మవిశ్వాసంతో ఆడతాడని, కెప్టెన్ గానూ అలాగే ఉంటాడని రైనా తెలిపాడు. ఈ ప్రపంచకప్ అతడికి పెద్ద అవకాశమని, ఈ సమయంలో తన పాత్ర ఏంటో కోహ్లీకి తెలుసని చెప్పాడు. అలాగే జట్టులోని మిగతా ఆటగాళ్లకూ అదే నమ్మకాన్ని కలిగించాలని సూచించాడు. అన్ని అంశాలూ అనుకూలంగా ఉన్నాయని, ఆశావాహదృక్పథంతో ముందుకుసాగితే ఇదే అత్యుత్తమ జట్టని రైనా కితాబిచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more