విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్ నోటీసులు జారీ చేయడంపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ద్రవిడ్‌కే నోటీసులిచ్చారంటే భారత క్రికెట్‌ను ఇక దేవుడే రక్షించాలని అన్నాడు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజయ్ గుప్తా ఆరోపణలపై అంబుడ్స్‌మన్ డీకే జైన్ ద్రవిడ్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గంగూలీ స్పందించాడు. ‘‘భారత క్రికెట్లో విరుద్ధ ప్రయోజనాల అంశం ఇప్పుడు ఓ తమాషా అయిపోయింది. వార్తల్లో ఉండడానికి అదో అత్యుత్తమ మార్గం. భారత క్రికెట్‌ను ఇక ఆ దేవుడే రక్షించాలి. విరుద్ధ ప్రయోజనాలపై బీసీసీఐ అంబుడ్స్‌మన్ నుంచి ద్రవిడ్‌కు నోటీసు వచ్చింది’’ అని గంగూలీ ట్విట్టర్లో పేర్కొన్నాడు. అతడికి హర్భజన్ సింగ్ మద్దతిచ్చాడు. ‘‘నిజంగా ద్రవిడ్‌కు నోటీసులిచ్చారా? ఇది ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. భారత క్రికెట్‌కు ద్రవిడ్ కన్నా మంచి వ్యక్తి దొరకడు.
అలాంటి దిగ్గజాలకు నోటీసులు పంపడమంటే వాళ్లను అవమానించడమే. భారత క్రికెట్‌కు వాళ్ల సేవలు అవసరం’’ అని అన్నాడు. భారత జూనియర్ కోచ్‌గా, ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉన్న ద్రవిడ్.. చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్య సంస్థ ఇండియా సిమెంట్స్‌లో ఉపాధ్యక్షుడిగా ఉండడం విరుద్ధ ప్రయోజనాలకు కిందికి వస్తుందన్నది సంజయ్ గుప్తా ఆరోపణ. అతడు ఇంతకుముందు సచిన్, లక్ష్మణ్‌లపై కూడా ఇలాంటి ఆరోపణలే చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more