Arrest Warrant Issued Against Mohammed Shami మహమ్మద్ షమీపై చర్యలు తీసుకోం: బిసిసిఐ

India cricket board to not take action against mohammed shami

domestic violence case,Hasid Ahmed,Hasin Jahan,Mohammed Shami, cricket news, sports news, cricket, sports

India's cricket board has said it will not take action against fast bowler Mohammad Shami, after police issued an arrest warrant for him. The warrant comes a year after the cricketer was charged with domestic violence following a complaint by his wife.

మహమ్మద్ షమీపై చర్యలు తీసుకోం: బిసిసిఐ

Posted: 09/03/2019 05:29 PM IST
India cricket board to not take action against mohammed shami

భారత క్రికెట్ జట్టు ప్రధాన పేస్ బౌలర్ మొహమ్మద్‌ షమీపై న్యాయస్థానం జారీ చేసిన అరెస్ట్‌ వారెంట్‌ నేపథ్యంలో తాము అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలు లేవని బిసిసిఐ తేల్చిచెప్పింది. అతని భార్య హసీన్‌ జహాన్‌ దాఖలు చేసిన గృహ హింస ఫిర్యాదుపై, అలీపూర్‌ కోర్టు న్యాయమూర్తి షమీతో పాటు అతని సోదరుడు హసీద్‌ అహ్మద్‌ పైనా వారెంట్ ఇష్యూ చేశారు. వీరిద్దరూ 15 రోజుల్లోగా కోర్టు ముందు హాజరుకావాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు.

అయితే బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా పక్షం రోజుల గడువు ఇస్తున్నట్టు తెలిపారు. కాగా, గత సంవత్సరం తన భర్త మొహమ్మద్ షమీ అతని సోదరుడితో కలసి తనను తీవ్రంగా శారీరికంగా, మానసికంగా వేధిస్తున్నాడని హసీన్ జహాన్ సోషల్ మీడియా వేదికగా అరోపణలు చేసింది. ఆ తరువాత కోల్‌ కతా పోలీసులకు పిర్యాదు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 498-ఏ కింద షమీతోపాటు అతని సోదరుడిపైనా విచారణ చేపట్టారు.

ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో షమీ ఆడుతున్నాడు. ఇక టెస్టు సిరీస్ కూడా ముగిసిన నేపథ్యంలో అతను స్వదేశానికి చేరుకోనున్నాడు. కాగా, మొహమ్మద్ షమీపై అరెస్టు వారెంట్ జారీ అయిన నేపథ్యంలో స్పందించిన బిసిసిఐ అధికారులు అతనిపై ఇప్పుడే చర్యలు ఏమీ తీసుకోబోమని చెప్పారు. అయితే పోలీసులు అతనిపై చార్జ్‌ షీట్‌ ను దాఖలు చేసిన తరువాత, దానిన పూర్తిగా పరిశీలించిన పిమ్మట షమీపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : domestic violence case  Hasid Ahmed  Hasin Jahan  Mohammed Shami  cricket  sports  

Other Articles