దక్షిణాఫ్రికాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు పేలవంగా ఓటమి పాలైంది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. కాగా, టీమిండియా ఓటమికి కెప్టెన్ కోహ్లీనే కారణమా.? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈమ్యాచ్ టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం బెంగళూరులో వర్షం పడింది. దీంతో.. పిచ్‌పై ఉన్న తేమ కారణంగా.. బ్యాట్స్‌మెన్ హిట్టింగ్‌కి ప్రయత్నించినా.. ఆశించిన విధంగా అడలేరు. కానీ.. విరాట్ కోహ్లీ సాహసోపేతంగా తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు.
పిచ్‌ని సద్వినియోగం చేసుకున్న దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో.. భారత జట్టులో శిఖర్ ధావన్ (36) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. ఈ స్టేడియంలో ఘనమైన రికార్డ్ ఉన్న విరాట్ కోహ్లీ కూడా 15 బంతులాడినా కనీసం ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయాడంటే పిచ్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 134/9కి పరిమితమవగా.. లక్ష్యాన్ని మరో 19 బంతులు మిగిలి ఉండగానే 140/1తో దక్షిణాఫ్రికా ఛేదించేసింది.
అయితే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో.. జట్టుకి ఒత్తిడిని పరిచయం చేయాలనే ఆలోచనతో తాను ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నట్లు కోహ్లీ చెప్పుకోచ్చాడు. వాస్తవానికి టీ20 టీమ్.. బుమ్రా, భువీ, చాహల్, కుల్దీప్ లేకపోవడంతో అనుభవలేమితో ఉంది. ఈ సమయంలో ప్రయోగాలు చేయడం ద్వారా ఓటమితో యువ బౌలర్లు మరింత కుంగుబాటుకి లోనయ్యే ప్రమాదం ఉంది. మొత్తంగా.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more