అంతర్జాతీయ క్రికెట్ లో భారత దిగ్గజ స్పిన్నర్ అనీల్ కుంబ్లే నమోదు చేసిన గణంకాలను దేశవాళీ క్రికెట్ లో అందుకున్నాడు ఓ యువకెరటం. మేఘాలయకు చెందిన యువ ఆఫ్ స్పిన్నర్ నిర్దేశ్ బైసోయా అసాధారణ ప్రతిభను కనబరిచి సరికొత్త రికార్డును సృష్టించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా, అండర్-16 పోటీల్లో పాల్గొన్న నిర్దేశ్, ప్రత్యర్థి నాగాలాండ్ జట్టతో జరుగుతున్న మ్యాచ్ లో అమాంతం అనీల్ కుంబ్లే తరహా ఫీటును నమోదు చేశాడు.
మొత్తం 10 వికెట్లనూ తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 21 ఓవర్లు బౌలింగ్ చేసిన నిర్దేశ్, ఈలోగానే అరుదైన రికార్డును నమోదు చేశాడు. 21 ఓవర్లలో 10 ఓవర్లు మెయిడెన్లు వేసి, కేవలం 51 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇతని ధాటికి నాగాలాండ్ జట్టు 113 పరుగులకే ఆలౌట్ అయింది. గడచిన రెండేళ్లుగా అండర్-16 జట్టులో ఆడుతున్న నిర్దేశ్, గత సిరీస్ లో ఆరు మ్యాచ్ లు ఆడి 33 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
మీరట్ కు చెందిన నిర్దేశ్, ప్రస్తుతం మేఘాలయ జట్టులో ఉన్నాడు. కాగా, దాదాపు 20 సంవత్సరాల క్రితమే అనిల్ కుంబ్లే టెస్ట్ ల్లో పాకిస్థాన్ పై ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఆపై కూచ్ బెహర్ ట్రోఫీలో మణిపూర్ పేసర్ రెక్స్ సింగ్ కూడా ఇదే ఘనత సాధించాడు. ఇటీవలి సీకే నాయుడు ట్రోఫీలో పుదుచ్చేరి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సిదాక్ సింగ్ కూడా 10 వికెట్లు తీశాడన్న సంగతి తెలిసిందే. 10 వికెట్లు తీసిన నిర్దేశ్ పై క్రికెట్ ప్రపంచం పొగడ్తలు గుప్పిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more