ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని ప్రస్తుత భారత క్రికెట్ జట్టు సెలక్షన్ ప్యానల్‌ను మార్చేయాలని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ డిమాండ్ చేశాడు. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కల్పించుకోవాలన్నాడు. భారత క్రికెట్ జట్టుకు ఇక బలమైన సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే సమయం ఆసన్నమైందన్నాడు. ఈ విషయంలో గంగూలీ చొరవ తీసుకుంటాడని ఆశిస్తున్నట్లు భజ్జీ తన ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నాడు.
వెస్టిండీస్‌తో త్వరలో ఆరంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా భారత యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని లోక్‌సభ ఎంపీ శశి థరూర్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ‘ ఎంతో కాలంగా దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్‌కు ఎంపిక చేయకపోవడం నన్ను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. కనీసం చాన్స్ కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ ఎంపిక చేసినా తుది జట్టులో శాంసన్ ఉండటం లేదు. మూడు టీ20లకు డ్రింక్స్ ఇవ్వడం వరకే పరిమితం చేశారు.
కానీ జట్టులో అవకాశం ఇవ్వకుండా విస్మరించారు. అతన్ని బ్యాటింగ్‌ను పరీక్షించాలనుకుంటున్నారా.. లేక అతని హృదయాన్ని టెస్టు చేయాలనుకుంటున్నారా’ అని శశి థరూర్ మండిపడ్డారు. దీనికి బదులు ఇచ్చిన భజ్జీ.. భారత సెలక్షన్ కమిటీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నాడు. ‘నేను అనుకోవడం శాంసన్ హృదయాన్ని టెస్టు చేయాలనే అనుకుంటున్నారు. సెలక్షన్ ప్యానల్‌ను మార్చాలి. పటిష్టమైన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలి. దాదా.. అందుకు చర్యలు తీసుకుంటాడనే ఆశిస్తున్నా’ అని థరూర్ ట్వీట్‌కు భజ్జీ రిప్లై ఇచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more