టీమిండియా మాజీ సారధి, వికెట్ కీపర్, మిస్టర్ కూల్ ధోని రిటైర్మెంట్ పై వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆయన ఎంతలా కష్టపడుతున్నారు.. అందుకు ఎలా సన్నధమవుతున్నారో చెప్పుకోచ్చాడు టీమిండియా మాజీ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు సురేష్ రైనా. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు ఈసారి విభిన్నంగా ప్రిపేర్ అవుతున్నాడు. మహీ, రాయుడు, మురళీ, తాను ఒక బృందంగా ఏర్పడి సాధన చేశామని చెప్పాడు. లాక్ డౌన్‌కు ముందు చెన్నైలో నిర్వహించిన శిబిరానికి వీరంతా హాజరైన సంగతి తెలిసిందే.
చెన్నైలో ఉన్నప్పుడు ధోనీ ప్రతిరోజు 2-4 గంటలు సాధన చేసేవాడు. అయినప్పటికీ అతడు ఏమాత్రం అలసిపోలేదని అన్నారు. ఉదయం జిమ్ లో కసరత్తులు చేయడంతో పాటు.. సాయంత్రం 3 గంటలు బ్యాటింగ్ సాధన చేసేవాడు. వరుసగా జిమ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ సాధన చేస్తే మరుసటి రోజు శరీరమంతా బిగుతుగా మారినా ఆయన సాధనే నిలపడం లేదని అన్నారు. అలాంటప్పుడు మన శరీరం కొద్దిగా నెమ్మదించినా.. అదే సమయంలో మరింత కష్టపడాలని ఆయన ప్రోత్సహిస్తున్నారని రైనా తెలిపాడు.
మూడు గంటల శిక్షణ వుంటే ఐదు గంటలు సాధన చేయాలన్నారు అప్పుడే అలసట లేకుండా నాలుగు గంటలు మ్యాచ్ ఆడగలమని రైనా పేర్కొన్నాడు. ‘టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మహీభాయ్ తో కలిసి ఆడాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సాధన భిన్నంగా సాగింది. ఆయన ఎంత బాగా సన్నద్ధమయ్యారో తెలుసుకొనేందుకు టోర్నీ త్వరగా ఆరంభం కావాలని కోరుకుంటున్నని అన్నారు. శిబిరంలో ప్రత్యక్షంగా తానేం చూశానో అందరికీ తెలియాలని భావిస్తున్నా. ఎవరైనా కష్టపడి సాధన చేస్తే ప్రార్థనలు, ఆశీర్వాదాలు వాటి పనిచేస్తాయని రైనా వెల్లడించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more