వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ బాటలోనే టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా పయనిస్తున్నట్లు వున్నాడు. ఇంతకీ ఏ విషయంలో అంటారా.? ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే యువరాజ్ సింగ్ మాత్రం ఇలాంటి ప్రకటన చేసిన తరువాత ఏకంగా కొన్న నెలలు పూర్తైన తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక లీగ్ బిగ్‌బాష్‌పై కన్నేశాడంటూ వార్తలు వచ్చాయి. అతడి కోసం ఓ ఫ్రాంచైజీని వెతికే పనిలో క్రికెట్ ఆస్ట్రేలియా తలమునకలై ఉందని యువీ మేనేజర్ కూడా చెప్పాడు.
దీంతో యువీ అభిమానులు మాత్రం మళ్లీ తమ డాషింగ్ బ్యాట్స్ మెన్ ఆటను తిలకించవచ్చునని సంబరపడుతున్నా.. తన నిర్ణయాన్ని బిసిసిఐ మద్దతు పలుకుతుందా.? అన్ని కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎందుకంటే యూవీ ప్రకటించిన తన రిటైర్మెంటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యమే అయినా.. అది అంత సులువుగా బిసిసిఐ అమోదిస్తుందా.? అన్నది వేచి చూడాల్సిందే. ఇదిలావుండగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ పునీత్ బాలి కోరిక మేరకు తాను తన రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించానని యువీ పేర్కొన్నాడు. నిజానికి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి తొలుత ఆలోచించానని, బాలి విజ్ఞప్తితో కాదనలేకపోయానని అన్నాడు.
అయితే నెల రోజులుగా బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. యువీ ఇప్పుడు పంజాబ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడని, పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) అభ్యర్థన మేరకు మొహాలీ స్టేడియంలో రెండు సుదీర్ఘ శిబిరాలు కూడా నిర్వహించాడని పునీత్ బాలి తెలిపారు. యువీ ఆధ్వర్యంలో ఈ శిబిరంలో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రన్ సింగ్, అన్మోల్ ప్రీత్ సింగ్ సాధన చేసినట్టు పేర్కొన్నారు. శిక్షణ సందర్భంగా యువీ మళ్లీ ఆటపై మనసు మళ్లిందని, తాను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొంటూ బీసీసీఐ చీఫ్ గంగూలీకి యువీ లేఖ రాశాడని బాలి వివరించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more