ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత డీన్ జోన్స్(59) కన్నుమూశారు. పరుగుల యంత్రంగా పేరుగాంచిన ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ముంబైలోని ఓ హోటల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్ట్రేలియాకు చెందిన డీన్ జోన్స్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. ఐపీఎల్ పోటీలు యూఏఈలో జరుగుతున్నా, ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో వ్యాఖ్యత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దక్షిణ ముంబయిలోని ఓ హోటల్ కారిడార్ లో ఇతర సహచరులతో ముచ్చటిస్తున్న ఆయన ఉదయం 12 గంటల సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు.
దీంతో హడలిపోయిన సహచరులు ఆయనను వెంటనే అంబులెన్స్ లో హరికిషన్ దాస్ ఆసుపత్రికి తరలించారు. కాగా, మార్గమధ్యంలోనే జోన్స్ మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జోన్స్ మృతి చెందిన సమాచారాన్ని ఆస్ట్రేలియాలోని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కాగా, జోన్స్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే అవకాశాలున్నాయి. డీన్ జోన్స్ ఆస్ట్రేలియా క్రికెట్ లో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 80, 90వ దశకాల్లో అనేక వీరోచిత ఇన్నింగ్స్ లతో ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలు అందించారు.
1984లో టెస్ట్ కెరీర్ ఆరంభించిన జోన్స్ 52 మ్యాచ్ లు ఆడి 11 సెంచరీలు, 14 అర్ధసెంచరీలతో 3,631 పరుగులు సాధించాడు. సగటు 46.55. ఇక వన్డేల్లో 164 మ్యాచ్ లు లు ఆడి7 సెంచరీలు, 46 ఫిఫ్టీల సాయంతో 6,068 రన్స్ నమోదు చేశాడు. జోన్స్ మరణంతో ఆస్ట్రేలియా క్రికెట్ లోనే కాదు, ప్రపంచ క్రికెట్ రంగంలోనూ విషాదం నెలకొంది. ఆ ఆసీస్ దిగ్గజం ఇక లేరన్న వార్తతో ఆయనతో అనుబంధం ఉన్న మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. క్రీడా ప్రముఖులు ఆయన మృతికి ప్రగాడ సంతాపాన్ని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more