తన జట్టును ఓటమి నుంచి కాపాడేందుకు ఓ బ్యాట్స్ మెన్ ఎం చేయగలడో అదే టీమిండియా అల్ రౌండర్ హార్థిక్ పాండ్య చేశాడని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కొనియాడాడు. భారత జట్టుకు నైపుణ్యం గల బ్యాట్స్ మెన్ కన్నా.. ఆ కీలక సమయంలో ఫాండ్యా లాంటి ఆటగాడు అత్యంత అవసరమన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన తొలి వన్డేలో కొద్దిపాటి పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడని చెప్పిన చోప్రా.. పాండ్య సాధించిన కీలకమైన 90 పరుగులు జట్టుకు ఘోర ఓటమి నుంచి తప్పించాయని అన్నారు.
ఫాండ్యా మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నంత సేపు భారత శిబిరంలో ఆశలు నిలిపాడని ఆకాశ్ పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడిన చోప్రా ఈ మ్యాచ్ పై విశ్లేషణ చేశాడు. ఈ సందర్భంగా పాండ్య ఆటను పొగడ్తలతో ముంచెత్తాడు. టీమీండియా పూర్తిస్థాయిగా పాండ్య అవతరిస్తున్నాడని, ఇలానే మున్ముందు కూడా రాణిస్తే జట్టులో అతని స్థానం కూడా మరింత ముందుకు పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అటు బంతితో రాణిస్తున్న ఈ అల్ రౌండర్.. బ్యాట్ తో కూడా బాగా రాణిస్తే అతడు ఆడుతున్న ఆరో స్థానం నుంచి అతడ్ని నాలుగైదు స్థానాలకు కూడా జట్టు యాజమాన్యం మార్చవచ్చునని అన్నాడు.
అవకాశాల కోసం వేచి చూడకుండా వచ్చిన దానినే సద్వినియోగం చేసుకున్న పాండ్యా.. షార్ట్ పిచ్ బంతులను దీటుగా ఎదుర్కొన్నాడని అన్నాడు. స్పిన్నర్లను కూడా ఉతికారేశాడని ప్రశంసించాడు, ధావన్ తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా అతడే 75 పరుగులు చేశాడు. పాండ్య అద్భతమైన ఆటతో ఆకట్టుకున్నాడన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 374/6 భారీ స్కోర్ సాధించిన సంగతి తెలిసిందే. ఆరోన్ ఫించ్(114), స్టీవ్‌స్మిత్(105) శతకాలతో మెరవగా భారత బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. పాండ్య(90), ధావన్(74) అర్ధ శతకాలు సాధించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more