ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండటంతో మరోసారి ఆ దేశం మెల్లగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘన్ సైన్యం, తాలిబన్ల మధ్య యుద్ధం అభంశుభం తెలియని సాధారణ ప్రజలను బలి తీసుకుంటోంది. తమ దేశం రావణకాష్టంగా మారుతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. నానాటికీ భయాందోళనగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ప్రపంచ దేశాలకు, నేతలకు సాయం కోరుతూ ట్వీట్ చేశాడు.
తమను ఇలా గందరగోళంలో వదిలేయకండి అని వేడుకుంటున్నాడు. అతడు ట్విటర్ ద్వారా తన గోడు వెల్లబోసుకున్నాడు. ప్రపంచ నేతలారా! మా దేశం గందరగోళంగా ఉంది. పిల్లలు, మహిళలు సహా వేల మంది ప్రతి రోజూ మృత్యువాత పడుతున్నారు. ఇళ్లు, ఆస్తుల విధ్వంసం జరుగుతోంది. వేలాది కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. మమ్మల్ని ఇలా గందరగోళంలో వదిలేయకండి. ఆఫ్ఘన్ల హత్యలను, ఆఫ్ఘనిస్థాన్ విధ్వంసాన్ని ఆపండి. మాకు శాంతి కావాలి అని రషీద్ ఖాన్ ఎంతో ఆవేదనతో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లోని 65 శాతం భూభాగం మళ్లీ తాలబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.
Dear World Leaders! My country is in chaos,thousand of innocent people, including children & women, get martyred everyday, houses & properties being destructed.Thousand families displaced..
Don’t leave us in chaos. Stop killing Afghans & destroying Afghaniatan
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more