టీమిండియా పేసర్ గా రాణిస్తున్న హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ కు ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదని తెలిసి మహిళా అభిమానులు కూడా పెరిగిపోతున్నారు. ఈ విషయం సరిజ్ కు తెలుసో తెలియదో కానీ.. ఆయన ఇంగ్లాండ్ సిరీస్ లో రాణిస్తున్న కారణంగా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెరిగిపోయింది. తాజాగా ఈ జాబితాలో పాకిస్థాన్ కు చెందిన యాంకర్ అతగాడికి ఫిదా అయిపోయింది. సిరాజ్ పై ప్రశంసలు కురిపించింది. అతడంటే తనకు ఎంతో అభిమానమంటూ చెప్పుకొచ్చింది. స్వతహాగా స్పోర్ట్స్ యాంకర్ అయిన జైనబ్ అబ్బాస్.. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో సిరాజ్ పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకుంది.
అతడి గణాంకాలు అద్భుతమని పేర్కొంది. అతడి ప్రతిభకు లార్డ్స్ టెస్ట్ తో పాటు ఆస్ట్రేలియా సిరీస్ లో నమోదు చేసిన గణాంకాలే నిదర్శనమని వ్యాఖ్యానించింది. సిరాజ్ ఓ ప్రపంచ స్థాయి ఉత్తమ బౌలర్ అని కొనియాడింది. ప్రస్తుతం ఇంగ్లండ్ లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ లో ఆమె యాంకర్ గా చేస్తోంది. జైనబ్ స్వస్థలం లాహోర్. ఆమె తండ్రి నజీర్ పాక్ దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ఆడాడు. ఇంగ్లండ్ లోని వార్విక్ యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీలో ఎంబీఏ చేసినా.. తండ్రి క్రికెటర్ కావడంతో ఆమె స్పోర్ట్స్ వైపు అడుగులు వేసింది
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more