టీ20 ప్రపంచకప్ లో టీమిండియాను వరుస ఓటములు చుట్టుముడుతున్నాయి. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో పది వికెట్లతో ఓడిపోయిన భారత్.. గెలవక తప్పని రెండో మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ చేతిలో 8 వికెట్లతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ దిగిన సంగతి తెలిసిందే. ఓపెనర్ గా టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలందించిన రోహిత్‌ను వన్ డౌన్ లో పంపారు. ఈ నిర్ణయంపై భారత జట్టు మాజీ సారధి, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తి చేశాడు.
పాక్ చేతిలో పరాభవం తర్వాత ఇషాన్ కిషన్‌కు జట్టులో చోటివ్వాలని చాలా మంది భావించారు. అయితే అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని అంతా అనుకున్నారు. న్యూజిల్యాండ్ మ్యాచ్‌లో అందరూ అనుకున్నట్లే సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకున్నారు. అయితే సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మను పక్కనపెట్టి ఇషాన్ కిషన్‌ను ఓపెనింగ్‌కు పంపారు. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయడాన్ని సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో చేసిన మార్పు ‘కివీ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను నువ్వు ఎదుర్కోగలవన్న నమ్మకం మాకు లేదు’ అని రోహిత్ ముఖాన చెప్పినట్లే అని వ్యాఖ్యానించాడు.
ఇషాన్ కిషన్ ది హిట్ ఆర్ మిస్ కేసని, అతను ఆడతాడో లేదో చెప్పలేమని గవాస్కర్ అన్నాడు. ‘ఒకవేళ ఇషాన్ అద్భుతంగా ఆడి ఓ 70 పరుగులు చేస్తే అందరం మెచ్చుకుంటాం. కానీ అది జరగలేదు. ఈ ప్లాన్ వర్కవుట్ కాకపోతే విమర్శలు తప్పవు. ఓడిపోతామన్న భయంతో చేశారా లేదా తెలియదు కానీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో చేసిన మార్పులేవీ ఉపయోగపడలేదు’ అని గవాస్కర్ విమర్శించాడు. ఇషాన్ కిషన్ ను 4 లేదా 5వ స్థానంలో దింపాల్సిందని అభిప్రాయపడ్డాడు. అతన్ని ఓపెనింగ్ పంపడమంటే బౌల్ట్‌ను రోహిత్ ఎదుర్కోలేడని జట్టు నమ్మినట్లేనని, ఇలాంటి నిర్ణయాలు ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more