Inability to Win ICC Trophy Cost Virat Kohli ODI Captaincy కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ఇదే కారణం: సబా కరీమ్

Saba karim cites possible reason for virat kohli s departure from odi captain

Virat Kohli, BCCI, TeamIndia, Rohit Sharma, national selector, Saba Karim, ICC trophy, four-year stint, Rahul Dravid, Ravi Shastri, Indian cricket, Chetan Sharma, selection committee, Cricket news, Sports news, cricket, sports

The BCCI named Rohit Sharma as the full-time captain of the ODIs, replacing Virat Kohli. Former India selector Saba Karim shared his thoughts on the red-hot topic. He reckoned that Kohli was sacked as the ODI captain due to his inability to win an ICC trophy during his four-year stint as the leader of Team India.

కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ఇదే కారణం: సబా కరీమ్

Posted: 12/10/2021 06:17 PM IST
Saba karim cites possible reason for virat kohli s departure from odi captain

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్న టీమిండియా జట్టు వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మను బీసీసీఐ నియమించింది. దీంతో టీ20, వన్డేలకు పూర్తి స్థాయి కెప్టెన్ గా రోహిత్ ప్రమోట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కేవలం టెస్టు కెప్టెన్ గా మాత్రమే కొనసాగనున్నాడు. మరోపక్క, వన్డే కెప్టెన్ గా కోహ్లీని తొలగించడంపై ఆయన అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై పలువురు మాజీలు వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్, 2012లో టీమిండియా సెలెక్టర్ గా ఉన్న సబా కరీమ్ ఈ అంశంపై స్పందించారు.
 
గత నాలుగేళ్ల కాలంలో కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోయిందని... ఈ కారణం వల్లే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించారని సబా కరీమ్ అన్నారు. 2017లో మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించారని చెప్పారు. కోహ్లీ కెప్టెన్ గా భారత్ నాలుగు ఐసీసీ టోర్నీలను ఆడిందని... వీటిలో రెండు టోర్నీల్లో ఫైనల్స్ లో ఓడిపోయామని, ఒక్క టోర్నీలో సెమీస్ లో వెనుదిరిగామని తెలిపారు. ఒక్క టోర్నీని కూడా గెలవకపోవడం వల్లే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles