‘‘మనిద్దరం కలిసి ఉంటే జీవితం నిండుగా అనిపిస్తుంది. నా వెంట నువ్వుంటే సంతోషం. నన్ను శాంత స్వభావుడిగా, మరింత దయాహృదయుడిగా, హాస్య చతురత గల వ్యక్తిగా మార్చేశావు. మనిద్దరం కలిసి మన జీవితాలను అర్థవంతంగా మార్చుకున్నాం. ఈ ప్రయాణంలో ఏడాది కాలం అనేది చాలా చిన్న వ్యవధి. ఏ చిన్న విరామం దొరికినా నేను నీ సమక్షంలోనే గడపాలని కోరుకుంటాను’’ అని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజనా గణేషన్‌ను ఉద్దేశించి భావోద్వేగ పోస్టు చేశాడు. తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సతీమణికి విషెస్ తెలియజేశాడు.
ఐ లవ్ యూ అంటూ ఆమెపై ప్రేమను కురిపించాడు. ఈ సందర్భంగా తమ పెళ్లినాటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది వైరల్ అవుతోంది. కాగా కొంతకాలం ప్రేమలో మునిగితేలిన బుమ్రా- స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ గతేడాది మార్చి 15న గోవాలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో సత్తా చాటిన బుమ్రా... జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2022 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. మరోవైపు.. సంజన తన కెరీర్లో బిజీగా ఉన్నారు. ఏమాత్రం సమయం చిక్కినా ఇద్దరూ కలిసి ఒక్కచోట చేరి సమయాన్ని ఆస్వాదిస్తారీ జంట.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more