న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే ఆస్ట్రేలియా ఈజీ విజయాన్ని నమోదు చేసింది. కాగా, అనుకున్నది అనుకున్నట్లుగా అసీస్ అమలు చేసి ఉంటే ఈ విజయం మరింత ముందుగానే అసీస్ ఖాతాలో పడేది. అంటే మరింత భారీ స్కోరుతో అసీస్ విజయాన్ని అందుకునేవారు. అదేంటి అసీస్ అనుకున్నది అనుకున్నట్లుగా అమలు చేయలేదా.? అంటే కంగారు పడ్డ కంగారులు నిజంగానే కంగారు పడి చేతికి అంగిన వికెట్లను తీయడంలో జరిగిన జాప్యం, మిస్ ఫీల్డ్ కాస్తా విజయాన్ని వారి ఖాతాలో వేయడంలో ఆలస్యం చేసింది. చదువుతుంటే అర్థమైనట్టే ఉంది కానీ ఏ మాత్రం అర్థం కాలేదు.. అంటారా.?
ఆ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లను రనౌట్ చేసే సమయంలో గమ్మత్తైన ఘటన జరిగింది. కివీస్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ కవర్స్‌లోకి బంతిని కొట్టి ఒక పరుగు తీయాలని భావించాడు. కానీ నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న దేవాన్ కాన్వా మాత్రం ముందుకు కదలలేకపోయాడు. ఫీల్డింగ్ చేస్తున్న సీన్ అబ్బాట్‌కు నిజానికి బంతి దొరకలేదు. ఆ సమయంలో ఇద్దరు బ్యాటర్లు ఒకే వైపు పరుగు తీశారు. బాల్‌ను అందుకోవడంలో అబ్బాట్ మిస్ కావడంతో.. మళ్లీ ఇద్దరు బ్యాటర్లు స్ట్రయికర్ వైపు పరుగులు తీశారు. అయితే కీపర్ కేరీ బంతిని వికెట్లకు కొట్టడంలో విఫలం కావడంతో.. కివీస్ బ్యాటర్ విలియమ్సన్ తృటిలో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 196 టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ 82 రన్స్‌కే ఆలౌటైంది.
Mayhem in the middle #AUSvNZ pic.twitter.com/FzBY9SuKHD
— cricket.com.au (@cricketcomau) September 8, 2022
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more