Female fans in fifa world cup

female fans, female fans in brazil football games, fifa world cup news, female fans in fifa world cup, female fans showing off in fifa world cup, femal fans showing cleavage in fifa world cup, 2014 FIFA World Cup Brazil, FIFA World Cup 2014, Football World Cup

female fans Fifa World Cup in brazil football games

ఫుట్ బాల్ పోటీల మధ్య నలిగిపోయిన మహిళా అభిమానులు

Posted: 06/18/2014 11:21 AM IST
Female fans in fifa world cup

(Image source from: female fans Fifa World Cup in brazil football games)

బ్రెజిల్ లో నిర్వహించిన 2014 ఫిఫా వరల్డ్ కప్ ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. కేవలం 14 మ్యాచులు మాత్రమే ఆటలను నిర్వహించినా... దీని ప్రభావం యావత్తు ప్రపంచాన్ని తుడిచిపెట్టేసింది. దేశవిదేశాల నుంచి ఎంతోమంది ఫుట్ బాల్ ఫ్యాన్స్ బ్రెజిల్ లో జరుగుతున్న ఈ పోటీలను వీక్షించడానికి తరలి వస్తున్నారు. ఫుట్ బాల్ మ్యాచులు జరిగే స్టేడియంలలో కూడా అభిమానుల సంఖ్య తారాస్థాయికి చేరిపోతోంది. కొంతమంది స్టేడియంలో కూర్చోవడానికి సీట్లు లభించకపోయినప్పటికీ... బయటే కాలక్షేపం చేస్తూ వుండిపోతున్నారు. మరికొంతమంది మరీ విచిత్రంగా వీధుల్లో ఫుట్ బాల్ మీదున్న అభిమానాన్ని వ్యక్తపరుస్తూ... తమ దేశభక్తిని చాటుతూ ఒంటిమీద రంగురంగుల విగ్గులు, పెయింట్లను వేసుకుని సంతోషాన్ని వెళ్లగక్కుతున్నారు.

ఇందులో ముఖ్యంగా మహిళల హవా అయితే మరీ ఎక్కువగా వుంది. తమ దేశానికి చెందిన ఫుట్ బాల్ టీమ్ మ్యాచ్ లో గెలవకపోయినప్పటికీ సంతోషంగా ఆటలను వీక్షిస్తున్నారు. రంగురంగులు - చిట్టిపొట్టి డ్రెస్సులు ధరించిన కొంతమంది మహిళలు స్టేడియంలో కనువిందు చేస్తే... బ్రెజిల్ నగర వీధుల్లో తమ దేశభక్తిని పుష్కలంగా ప్రదర్శించేవిధంగా వారి జట్టు పతాకాలను ఒంటి మీద పెయింట్లతో, డ్రెస్సులతో ధరించి సందర్శిస్తూ కనిపించారు. కొంతమంది మహిళలు తమ జట్టు జాతీయ పతాకాలను ఎగరవేస్తూ, ఉత్సాహంగా స్టేడియంలలో ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే తమ ముఖాలు, పెదాల మీద కూడా రంగులు వేసుకుని ఫోటో కెమెరాలకు పోజులిచ్చారు.

ఏ టీమ్ తరఫు నుంచయినా గానీ కేవలం గోల్స్ పడటం మాత్రమే ఆలస్యం... అభిమానుల ఒకటే గోల! దేశ - జాతి వంటి ఎటువంటి విభేదాలు లేకుండా అందరి కలిసి మెలిసి ఈ బ్రెజిల్ వరల్డ్ కప్ పోటీలను ఆనందంగా అనుభవిస్తున్నారు. ఇందులో కొంతమంది మహిళలు అయితే ప్రత్యేకంగా తమవైపు ఆకర్షించుకునేందుకు నృత్యాల ప్రదర్శన కూడా చేశారు. ఇరానియన్ మహిళలు ఇదే తరహా పద్ధతులను అనుసరించి తమ సంతోషాన్ని నలుగరితో పంచుకున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు మీకోసం...


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/fifaworldcup

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles