Kostaria team wins on italy and enters to knock out

Kostaria team wins on italy and enters to knock out, kostaria wins, 2014 fifa world cup, fifa world cup 2014, kostaria team wins, kostaria team enters to knock out, kostaria team enters to knock out after 24 years, kostaria team latest news, fifa world cup 2014 news

Kostaria team wins on italy and enters to knock out

24ఏళ్ల తరువాత చరిత్ర సృష్టించిన కోస్టారికా జట్టు

Posted: 06/21/2014 10:15 AM IST
Kostaria team wins on italy and enters to knock out

(Image source from: Kostaria team wins on italy and enters to knock out)

బ్రెజిల్ లో నిర్వహించిన ఫిఫా వరల్డ్ కప్ 2014లో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సరంలో ఎవరూ ఊహించని విధంగా స్పెయిన్ ఘనవిజయం సాధస్తే... ఈసారి మాత్రం చతికిలపడిపోయి ఇంటిదారి కూడా పట్టేసింది. భారీ అంచనాల మీద బరిలోకి దిగిన అగ్రజట్లు కూడా తమ ప్రతిభను ప్రదర్శించలేకపోతున్నాయి.

ఇక తాజాగా గ్రూప్ ‘డి’లో కోస్టారికా జట్టు ఇటలీ వంటి అగ్రజట్టును 1-0 గోల్స్ తేడాతో ఓడించి, భారీ విజయాన్ని తన ఖాతాలోనమోదు చేసుకుంది. గత 24 సంవత్సరాల నుంచి అతి బలహీనమైన టీంగా పేరొందిన కోస్టారికా... అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ అరుదైర రికార్డును సృష్టించింది. ఇటలీ, ఉరుగ్వే వంటి జట్టులతో తలపడిన ఈ కోస్టారికా జట్టు వరుసగా విజయాలను సాధిస్తూ... చివరికి నాకౌట్ కు చేరిపోయింది.

కోస్టారికా ఈ విధంగా ఘనవిజయం సాధించడంతో మరో ఐరోపా అగ్రశ్రేణి జట్టుగా పిలువబడే ఇంగ్లాండ్ కథ కూడా ముగిసిపోయింది. గత రెండు మ్యాచుల్లో వరుసగా ఓటములను చవిచూసిన ఇంగ్లాండ్.. ఇటలీపై కోస్టారికా గెలుపొందడంతో ఇంటిదారి పట్టింది. కోస్టారికా గెలుపు వెనుక ఆ జట్టు ఆటగాడయిన రూయిజ్ దే కీలకపాత్ర. ఆట ప్రారంభమయిన ప్రతమార్థంలో 44వ నిముషాలవరకు హోరాహోరీగా సాగిన ఈ పోరాటం తరువాత రూయిజ్ హెడర్ అద్భుతంగా ప్రదర్శించి గోల్ సంపాదించాడు. దీంతో జట్టు అధిక్య స్థానంలో నిలిచిపోయింది. రెండవ ప్రతమార్థంలో ఇటలీ గోల్ వేసేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ... కోస్టారికా ఆటగాళ్లు సమర్థవంతంగా అడ్డుకోవడం వల్ల విఫలమయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles