(Image source from: Netherlands wins in knock out session opposite to the mexico)
ఫుట్ బాల్ ప్రపంచకప్ నాకౌట్ దశలో కొన్ని సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. మ్యాచ్ గెలుస్తుందనుకున్న జట్టు గెలుపు అంచులదాకా వెళ్లి తిరిగి ఇంటిదారి పడుతోంది. చిన్న జట్టే కదా అని తీసిపారేస్తే... అగ్రజట్లను సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆ సాకర్ ప్రపంచకప్ లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా నెదర్లాండ్స్ వంటి చిన్న జట్టుతో తలపడిన మెక్సికోకు కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. చివరి 87వ నిముషం వరకు ఆధిక్యంలో వున్న మెక్సికో.. మొత్తం వ్యవహారం తలకిందులయిపోయింది. గత ఫైనలిస్టుకు షాకిచ్చి క్వార్టర్స్ లో చేరబోతోందని మెక్సికో జట్టు అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా.. ఒక్కసారి నైరాశ్యంలోకి మునిగిపోయారు. చివరి మూడు నిముషాల్లోనే మ్యాచ్ గందరగోళ పరిస్థితిలో మెక్సికో ఓటమి ఖరారయింది.
మొదటి నాకౌట్ దశలో బ్రెజిల్ కు ముచ్చెమటలు పట్టిస్తే.. రెండో దశలో మెక్సికో, నెదర్లాండ్స్ ను దాదాపు ఓడించినంత పని చేసింది. ఓటమి ఖాయమనుకున్న దశలో నెదర్లాండ్స్ అనూహ్యంగా ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట 48వ నిముషంలో మెక్సికో గోల్ సాధించి ఆధిక్యంలో నిలిచింది. చివరి వరకు తన ఆధిక్యాన్ని కాపాడుకోవడానికి చాలానే ప్రయత్నించింది. అయితే చివరి నిముషాల్లో మాత్రం చేతులెత్తేసి, ఓటమిని తలమీద వేసుకుంది.
నెదర్లాండ్ ఆటగాడు అయిన స్నైడర్ 88వ నిముషంలో అందరి కళ్లు చెదిరేలా గోల్ కొట్టి... స్కోరును సమానం చేశాడు. దాంతో ఈ జట్టు కొంతవరకు ఊపిరి పీల్చుకుంది. అలాగే ఇంజురీ టైంలో (94వ నిముషం) మెక్సికో తన చేతులారా పెనాల్టీ వారికి అప్పజెప్పి.. ఓటమిని నెత్తినేసుకుంది. ఇంకో 2 నిముషాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకున్న తరుణంలో మెక్సికో, నెదర్లాండ్ జట్టుకు పెనాల్టిని ఇచ్చింది. దీంతో వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనే ఆశతో క్లాస్ - జాన్ హంటెలారర్ అద్భుతంగా గోల్ సాధించాడు. దీంతో నెదర్లాండ్స్ 2-1 స్కోరును మ్యాచ్ ను గెలిచింది.
మ్యాచ్ విశేషాలు :
బ్రెజిల్ కు చిలీ ఇచ్చిన పోటీ కన్నా... నెదర్లాండ్ కు మెక్సికో ఇచ్చిన పోటీయే చాలా ఎక్కువని చెప్పుకోక తప్పదు. గోల్ కోసం డచ్ ఎక్కువసార్లు ప్రయత్నించినప్పటికీ.. వారికి ధీటుగానే గోల్స్ వేయనీయకుండా మెక్సికో చాలావరకు ప్రయత్నాలు చేసింది. ప్రథమార్థంలో డచ్ వారికి రెండు, మూడు అవకాశాలు వచ్చినా.. మెక్సికో వాటికి అద్భుతంగా అడ్డుకోగలిగింది. హోరాహోరీగా సాగిన ప్రతమార్థం ఎటువంటి గోల్స్ లేకుండా ముగిసింది.
ఇక ద్వితీయార్థంలో మొదలైన మొదట మూడు నిముషాల్లోనే మెక్సికో ఆటగాడు శాంటోస్ గోల్ సాధించి, ఆరెంజ్ జట్టుకు షాకిచ్చాడు. దాంతో ఒత్తిడిలో పడిపోయిన నెదర్లాండ్స్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. మెక్సికో గోల్ కీపర్ ఒచావో, డిఫెండర్లు బాగానే అడ్డుకున్నారు. ఒక డచ్ ఓటమి ఖాయం అనుకుంటుండగా.. చివరి నిముషాల్లో అనుకోని విధంగా మలుపులు తిరిగింది. చివరి దశలో నెదర్లాండ్స్ రెండు గోల్స్ సాధించి, మెక్సికోకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more