Abhinav bindra says good bye to career

abhinav bindra, abhinav bindra wiki, abhinav bindra medals, abhinav bindra shooter, indian shooters, abhinav bindra family, abhinav bindra latest, abhinav bindra career, shooters, asian games, asian games live, asian games schedule, asian games today schedule, asian games finals, asian games medals, sports news, games, latest news, air rifil, air shooting

athlet abhinav bindra says good bye to his shooting career with bronze medal in asian games : shooter abhinav bindra ends his shooting career with bronze medal in asian games says he will continue if he qualifies for olympics 2016

కాంస్య పతకంతో అభి కెరీర్ క్లోజింగ్..?

Posted: 09/23/2014 10:44 AM IST
Abhinav bindra says good bye to career

దేశం గర్వించదగ్గ షూటర్ అభినవ్ బింద్రా కెరీర్ కు ముగింపు పలికినట్లే. ట్విట్టర్ లో ఆయన చేసిన ట్వీట్లు ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. రిటైర్మెంట్ పై ట్విట్టర్ లో చేసిన కామెంట్లపై మీడియా అడిగిన ప్రశ్నకు అభి అవును అని సమాధానం ఇచ్చాడు. దీంతో కెరీర్ ముగిసినట్లే అని భావించాలి. అయితే ఒలంపిక్స్ కు ఎంపికైతే చూద్దాం..! లేకపోతే ఇక అంతే అని మరొక ఆప్షన్ ఇచ్చాడు. చివరగా భారత్ కు పతకం తెచ్చిపెట్టాడు. ఆసియా గేమ్స్ లో 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ కాంస్య పతకం సాధించాడు. 187.1 స్కోరు చేసి మూడవ స్థానంలో నిలిచాడు.

అటు పది మీటర్ల ఎయిర్ షూటింగ్ టీం విభాగంలో కూడా భారత జట్టు మూడవ స్థానంలో నిలిచింది. ఈ టీంలో అభినవ్ బింద్రా, రవికుమార్, సంజీవ్ ఉన్నారు. ఇవాళే తనకు ప్రొఫెషనల్ షూటర్ గా చివరి రోజు అని అభినవ్ బింద్రా ప్రకటించాడు. 2008 ఒలంపిక్స్ లో 10మీటర్ల ఎయిర్ షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించి పూర్తిగా వెలుగులోకి వచ్చాడు. 1980 నుంచి ఒలంపిక్ గేమ్స్ లో భారత్ కు వచ్చిన తొలి స్వర్ణం అదే కావటంతో అందరికి గుర్తుండిపోయేలా దేశం గర్వించదగ్గ షూటర్ అయ్యాడు.

కెరీర్ అంతా లక్ష్య సాధన కోసం కృషి చేశాడు అభినవ్ బింద్రా. గురితప్పని లక్ష్యంతో ఎన్నో విజయాలు సాధించాడు. షూటింగ్ కెరీర్ లో ఎన్నో రికార్డులున్నాయి. కామన్ వెల్త్ గేమ్స్ కు వెళ్ళిన అతి చిన్న వయస్సున్న వ్యక్తి (15)గా చరిత్రకెక్కాడు. అతని ప్రతిభకు మెచ్చి కేంద్రం 2000సం.లో అర్జున అవార్డు, 2001 సం.లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించింది. 2002లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించాడు. 2006లో జాగ్రెబ్ లో జరిగిన ప్రపంచ షూటింగ్ పోటిల్లో గోల్డ్ మెడల్ సాధించి.., షూటింగ్ లో ప్రపంచ చాంపియన్ అయిన తొలి భారతీయుడుగా నిలిచాడు. 2006 కామన్ వెల్త్ లో ఒక బంగారు, ఒక కాంస్య పతకం సాధించాడు.

తుపాకి మోయలేని వ్యక్తికి గోల్డ్ మెడల్

2008 బింద్రాకు ఎప్పటికి గుర్తుండిపోయే సంవత్సరం. 2006 పోటిల తర్వాత బింద్రాకు తీవ్రమైన వెన్ను నొప్పి వచ్చింది. దీంతో మంచానికి పరిమితం అయ్యాడు. కనీసం తుపాకి మోయలేనంత బలహీనంగా అయిపోయాడు. అయితే పతకం సాధించాలన్న పట్టుదలతో కృషి చేశాడు. అనారోగ్యంతోనే సెలక్షన్లకు వెళ్ళి.., భారత్ తరపున స్థానం సంపాదించాడు. ఎవరూ ఊహించని రీతిలో ఉపఖండానికి బంగారు పతకం తెచ్చి భరతమాత ముద్దుబిడ్డ అనిపించుకన్నాడు. అటు దోహాలో జరిగిన ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించాడు. బింద్రా అసమాన ప్రతిభకు మెచ్చిన భారత ఆర్మీ., లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను ప్రకటించింది.

షూటర్ గానే కాకుండా బీబీఎ చదవిన బిజినెస్ విద్యార్థిగా బింద్రా బిజీ పర్సన్. పలు సంస్థల్లో పెట్టుబడులతో పాటు స్వయంగా.., కొన్ని సంస్థలను నడుపుతున్నాడు. కొన్ని  ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. కృషి, పట్టుదలతో కెరీర్ ను బంగారు పతకాల మయం చేసుకున్న అభినవ్ బింద్రా సేవలు దేశానికి ఇంకా అవసరం. 2016 ఒలంపిక్స్ లో తప్పక క్వాలిఫై అయి భరతమాత మెడలో మరో బంగారు పతకం వేయాలని తెలుగు విశేష్ మనసారా కోరుకుంటోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : abhinav bindra  asian games  air rifil  sports  

Other Articles