భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన సైనా నెహ్వాల ప్రవర్తనలో రోజురోజుకు చాలా మార్పులు కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక అగ్రశ్రేణి క్రీడాకారిణి అయిన సైనా కూడా ఇతరులలాగే మాటలు మారుస్తూ తన వ్యవహారశైలి ఎటువంటిదో నిరూపించుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా పరిణామాల ప్రకారం.. సైనా నెహ్వాల్ అసలు ఎంటో పూర్తిగా బయటపడిందని.. అనతికాలంలోనే ఈ అమ్మడిలో ఇంత మార్పురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొంటున్నారు.
ఆసియా క్రీడలు ఇంకా జరగకముందే సైనాకు, కోచ్ గోపీచంద్ కు మధ్య కొన్ని విభేదాలు తలెత్తడం వల్ల వారిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే! దాంతో ఈ అమ్మడు ఆసియా క్రీడలకోసం బెంగుళూరులో కోచ్ విమల్ కుమార్ దగ్గర 15 రోజులవరకు శిక్షణకు వెళ్లింది. ఆ విషయం మీదే ఈ అమ్మడు అప్పట్లో.. కేవలం ఆసియా క్రీడల కోసమే తాను అకాడమీ మారానని.. మళ్లీ గోపీచంద్ అకాడమీకి వస్తానని పేర్కొంది. అయినా ఆసియా క్రీడలు ముగిసి ఇప్పటికే చాలారోజులు గడిచినా.. సైనా మాత్రం ఇంకా బెంగుళూరులోనే శిక్షణ తీసుకుంటుంది. డెన్మార్క్ ఓపెన్ కోసం విమల్ దగ్గరే ఆమె తర్ఫీదు పొందుతోందని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.
అయితే.. గతంలో పేర్కొన్న విధంగా సైనా ఆసియా క్రీడలు ముగిసిన తర్వాత కూడా ఇంకా గోపీచంద్ అకాడమీకి ఇంకా రాకుండా.. బెంగుళూరులోనే శిక్షణ తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇకనుంచి ఈ అమ్మడు తన గురువు పుల్లల గోపీచంద్ అకాడమీకి వచ్చే అవకాశాలు కనిపించడంలేదని, అతనికి శాశ్వతంగా గుడ్ బై చెప్పే ఆలోచనల్లో ఆమె వుందని అకాడమీ వర్గాలు అంటున్నాయి. భవిష్యత్తులో వీరిద్దరూ కలిసే దాఖలాలు అస్సలు కనిపించడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more