స్నూకర్ క్రీడలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఏకంగా 12 టైటిళ్లు గెలిచి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అడ్వాణీకి ఓ 14ఏళ్ల కుర్రాడు కోలుకోలేని షాకిచ్చాడు. స్నూకర్ గేమ్’లో ఆరితేరిన పంకజ్’నే ఆ బాలుడు తన ప్రతిభతో సునాయాసంగా ఓడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే క్రీడారంగంలో అడుగుపెట్టిన సంచలనం సృష్టించిన ఆ బుడతడు.. దిగ్గజ ఆటగాళ్లను ఓడిస్తూ పెను సంచలనం క్రియేట్ చేశాడు.
బెంగుళూరులో జరుగుతున్న ప్రపంచ స్నూకర్ ఛాంపియన్’షిప్’లో పంకజ్ 14 ఏళ్ల చైనా కుర్రాడు యన్ బింగ్’టావో చేతిలో పరాజయం పాలయ్యాడు. మొదటినుంచి అద్భుతంగా ప్రదర్శిస్తూ క్వార్టర్ ఫైనల్లోకి చేరిన పంజక్.. ఆ చైనా కుర్రాడి చేతిలో మాత్రం ఘోరంగా పరాజయం పాలయ్యాడు. బింగ్ టావో 6-4 స్కోరుతో పంకజ్’ను ఓడించాడు. అంతేకాదు.. అతగాడు సెమీస్’లో 7-5 స్కోరుతో థాయ్’లాండ్’కు చెందిన క్రిస్టానట్’ను ఓడించి ఫైనల్లో ప్రవేశించాడు. ఇక ఫైనల్లో ఆ బుడతడు పాకిస్తాన్’కు చెందిన మహ్మద్ సజ్జాద్’తో తలపడనున్నాడు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more