ప్రముఖ స్విమ్మర్ సారా కొరియా మృతిచెందింది. అనుకోని విధంగా రోడ్డు ప్రమాదానికి గురై బ్రెజిల్‌కు చెందిన ఈ స్విమ్మర్ మృత్యువాత పడింది. 2011లో జరిగిన పాన్ అమెరికన్ క్రీడల్లో స్విమ్మింగ్ విభాగంలో వెండిపతకాన్ని గెలుచుకున్న.. కోరియా శనివారం ఓ బస్సు స్టాప్ వద్ద వెయిట్ చేస్తుండగా అతి వేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొని వెళ్లిపోయింది. ఆమెను హుటాహుటిన సమీపంలోని మైగెల్ కోటో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కొరియా బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు ప్రకటించారు.
ఈ విషయాన్ని ఆమె తల్లి మేరియా ఫాతిమా అల్వెస్ గోంకావెస్ ఫేస్బుక్ ద్వారా వెల్లడించినట్లు ఓ మీడియా తెలిపింది. అయితే తన కూతరిది ప్రమాదం కాదని అనుమానాన్ని అమె వ్యక్తం చేసింది. తన కూతురును ఎవరో కావాలనే హత్య చేసినట్లు తల్లి ఫాతిమా ఆరోపించింది. కొరియాను తన ప్రత్యర్థులో.. లేక మరెవరో తనను హతమార్చారని సందేహాన్ని వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేవరకు విశ్రమించబోనని ఆమె అన్నారు. సారా కొరియా గత అక్టోబర్‌లోనే స్మిమ్మింగ్ నుంచి రిటైర్ అయ్యి మోడలింగ్‌పై దృష్టిని సారించి అకాల మరణం పొందింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more