Barcelona star Neymar accused of tax evasion by Brazilian authorities

Neymar under investigation for tax evasion

Neymar under investigation for tax evasion, Rio de Janerio, Neymar, tax evasion, Neymar involved in Tax evasion, Spanish club, Brazilian team Santos, Barcelona

Brazilian footballer Neymar, currently playing forward for Barcelona, is under investigation in his home country for tax evasion, a report said on Saturday.

నెయ్ మర్ పై బ్రెజిల్ ప్రభుత్వం విచారణ

Posted: 06/06/2015 08:59 PM IST
Neymar under investigation for tax evasion

బ్రెజిల్ దేశానికి చెందిన పుట్ బాల్ యువసంచలనంగా పేరు గడించిన ఆడగాడు నెయ్ మర్ ప్రస్తుతం అక్కడి ప్రభుత్వ విచారణను ఎదుర్కోనున్నారు. ప్రపంచ ఫుట్ బాల్ క్రీడాలోకం నెయ్ మర్ పేరు ప్రస్తుతం ప్రతిధ్వనిస్తుంది. అయితే అలాంటి నెయ్ మర్ తన సోంత దేశంలో పన్ను ఎగవేత కేసులో విచారణను ఎదుర్కోనున్నారు. నెయ్ మర్ తాను పోందిన పలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పన్నును చెల్లిందలేదని స్థానిక మీడియా కథనాలను ప్రచురించిన నేపథ్యంలో బ్రెజిలియన్ ప్రభుత్వం అయనపై విచారణకు అదేశించింది.

గత కొన్నాళ్ల కిందట బ్రేజీలియన్ జట్టు సాంటోస్.. స్పానిష్ క్లబ్ తో కుదర్చుకున్న ఓప్పందంలో భాగంగా నెయ్ మర్ కు భారీ మొత్తంలో చెల్లింపులను ముట్టజెప్పింది. తాను పొందింది కేవంల 57 మిలియన్ యూరోలని నెయ్ మర్ ప్రకటించగా, పత్రిక వర్గాలు మాత్రం నెయ్ మర్ కు స్పానిష్ క్లబ్ సుమారుగా 86.3 మిలియన్ యూరోలను చెల్లించిందని, పన్నును ఎగవేసేందుకే తాను పోందిన మొత్తాన్ని తక్కువగా నెయ్ మర్ చూపుతున్నాడని కథనంలో వివరించింది. అయితే మిగిలిన మొత్తానికి సంబంధించిన పన్నును నెయ్ మర్ చెల్లించలేదని బ్రెజీలియన్ వార పత్రిక ఈపోక కథనాన్ని ప్రచురించడంతో నెయ్ మర్ పన్ను ఎగవేత అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో నెయ్ మర్ ఆస్తులతో పాటు అతని తండ్రి పేరిట వున్న ఆస్తులన్నింటిపై విచారణకు అక్కడి ప్రభుత్వం అదేశింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rio de Janerio  Neymar  tax evasion  

Other Articles