2018 World Cup Qualifiers LIVE: Iran on top with 3-0 lead against India

Iran thrash india 3 0 to top group d

India Vs Iran, 2018 World Cup qualifiers, Sunil Chhetri, Live Football, Indian football live, latest FIFA World Rankings, Sree Kanteerava Stadium, Bangalore. 2018 FIFA World Cup qualifiers, Iran,Football India vs Iran FIFA World Cup Qualifier Highlights: Iran Thrash India 3-0 to Top Group D latest Football news

In Group D of the 2018 FIFA World Cup Qualifiers, Iran defeated India 3-0 at the Sree Kanteerava Stadium in Bangalore.

ఫిఫా ఆశలపై నీళ్లు.. క్వాలిఫై మ్యాచ్ ఇరాన్ గెలుపు

Posted: 09/08/2015 10:27 PM IST
Iran thrash india 3 0 to top group d

ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ టోర్నీలో భారత్ పరాజయం పరిపూర్ణమైంది. ఆసియా విభాగంలో ఇరాన్ పై జరిగిన గ్రూప్ డీ మ్యాచ్ లో భారత్ 3-0 తేడాతో ఓటమి చవిచూసింది. ఇప్పటికే గ్రూప్ లో ఆడిన రెండు మ్యాచ్ లు ఓడిన భారత్.. ఇవాళ బెంగళూరు శ్రీకంఠీరవ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయం మూట గట్టుకుంది. ఆసియా విభాగంలో హాట్ పేవరెట్ ఇరాన్ తో మ్యాచ్ ప్రారంభంలో భారత్ అటాకింగ్ గేమ్ ఆడింది.

అయితే డిఫెన్స్ వైఫల్యంతో మ్యాచ్ 29వ నిమిషం ఇరాన్ ప్లేయర్ సర్దార్ అజ్మన్ తొలి గోల్ చేశాడు. దీంతో తొలి అర్థ భాగంలో ఇరాన్ 1-0 లీడ్ తో నిలిచింది. విరామం తర్వాత బరిలోకి దిగిన ఇరాన్ ఇండియన్ గోల్ పోస్ట్ మీద దాడులు ముమ్మరం చేసింది. దీంతో 47, 50 నిమిషాల్లో రెండు వరస గోల్స్ లభించాయి. అయితే.. భారత డిఫెన్స్ ప్రతిఘటించడంతో ఇరాన్ లీడ్ మరింత పెంచుకోలేక పోయింది.  సెకండ్ హాఫ్ లో భారత్ గోల్ చేసేందుకు తీవ్రంగా శ్రమించినా.. ఫలితం లేక పోయింది. దీంతో మ్యాచ్ 3-0 గోల్స్ తో ఇరాన్ పరమైంది.   

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Vs Iran  2018 World Cup qualifiers  Sunil Chhetri  

Other Articles