Injured Saina Nehwal out of Hong Kong Open Super Series

Pv sindhu kidambi srikanth face challenge saina nehwal skips hong kong open

Hong Kong Open, Saina Nehwal, PV Sindhu, Kidambi Srikanth, Jwala Gutta, Commonwealth Games, Ashwini Ponnappa, Hong Kong Open Badminton,Jwala Gutta,Ashwini Ponnappa,P V Sindhu,Ajay Jayaram,K Srikanth,HS Prannoy,Badminton

Ace Indian shuttler Saina Nehwal will be missing Hong Kong Open due to an injury and in her absence P V Sindhu and Kidambi Srikanth will lead the Indian charge at the USD 350,000 Super Series event starting here tomorrow.

హాంగ్ కాంగ్ ఓపెన్ కు సింధూ, శ్రీకాంత్, గాయంతో దూరమైన సైనా

Posted: 11/17/2015 07:02 PM IST
Pv sindhu kidambi srikanth face challenge saina nehwal skips hong kong open

హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి భారత స్టార్ షట్లర్,  ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వైదొలిగింది. నెంబర్ వన్ ర్యాంకును తిరిగి సాధించేందుకు దోహదపడే ఈ సిరీస్ కు అమె కాలి గాయం ఇబ్బందులు పెడుతోంది. కాలిగాయంతో బాధపడుతుండటంతో హాంకాంగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తాను పాల్గొనడం లేదని సైనా స్పష్టం చేసింది. ఈ సీజన్ బ్యాడ్మింటన్ ముగింపు టోర్నీలో అమె పాల్గోనకపోవడంతో భారత మహిళల టీమ్ కు పివి సింధు, పురుషుల టీమ్ కు కిదాంబి శ్రీకాంత్ లు సారథ్యం వహించనున్నారు. ఈ టోర్నీ నుంచి ముందుగానే సైనా వైదొలగడంతో భారత జట్టు ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే.
 
2010 లో హాంకాంగ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్న సైనా..  మరోమారు సిరీస్ ను గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. కాగా, బుధవారం నుంచి ఆరంభం కానున్న టోర్నీలో సింధు తన తొలి పోరులో టాప్ సీడ్,  ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్(స్పెయిన్)తో తలపడనుంది. గత నెల్లో జరిగిన డెన్మార్ ఓపెన్ లో మారిన్ ను ఓడించిన సింధు అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కాగా, ఓవరాల్ ముఖాముఖి రికార్డులో సింధు 2-3తో వెనుకంజలో ఉంది. కాగా, పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్ లో టియాన్ హౌయి(చైనా)తో తలపడనున్నాడు. గత సంవత్సరం హాంకాంగ్ ఓపెన్ లో శ్రీకాంత్ సెమీ ఫైనల్ వరకూ వెళ్లాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hong Kong Open  Saina Nehwal  PV Sindhu  Kidambi Srikanth  

Other Articles