దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో దిల్లీ చాంపియన్ గా అవతరించింది. ఫైనల్ మ్యాచ్ లో దిల్లీ ఏసర్స్ 4-3 తేడాతో ముంబైని ఓడించి.. ఛాంపియన్ గా నిలిచింది. తొలి మ్యాచ్ గా జరిగిన మిక్స్-డ్ డబుల్స్ లో అక్షయ్ దేవాల్కర్-గాబ్రియెలా అడ్-కాక్ (ఢిల్లీ) ద్వయం 6-15, 12-15తో కామిల్లా జుల్-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై) జోడీ చేతిలో ఓడిపోయింది. దాంతో ఆ జట్టు 0-1తో వెనుకబడింది. అయితే రెండో మ్యాచ్ గా జరిగిన తొలి పురుషుల సింగిల్స్లో టామీ సుగియార్తో (ఢిల్లీ) 13-15, 15-9, 15-9తో హెచ్-ఎస్ ప్రణయ్ (ముంబై)ను ఓడించాడు. ఫలితంగా స్కోరు 1-1తో సమమైంది. మూడో మ్యాచ్ గా నిర్వహించిన పురుషుల డబుల్స్ లో కూ కీట్ కీన్-తాన్ బూన్ హెంగ్ (ఢిల్లీ) జోడీ 14-15, 15-10, 15-14తో మథియాస్ బో-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై) జంటను ఓడించింది.
దాంతో ఢిల్లీ 2-1 పాయింట్లతో ముందంజ వేసింది. అయితే నాలుగో మ్యాచ్ గా జరిగిన మహిళల సింగిల్స్ పోటీని ముంబై రాకెట్స్ తమ ‘ట్రంప్ మ్యాచ్’గా ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో హాన్ లీ (ముంబై) 12-15, 15-8, 15-8తో పీసీ తులసీ (ఢిల్లీ)పై గెలిచింది. ‘ట్రంప్ మ్యాచ్’ నెగ్గినందుకు ముంబై ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. దాంతో ముంబై 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక చివరి మ్యాచ్ గా జరిగిన రెండో పురుషుల సింగిల్స్ను ఢిల్లీ ఏసర్స్ జట్టు ‘ట్రంప్ మ్యాచ్’గా ఎంపిక చేసుకుంది. ఈ మ్యాచ్ లో రాజీవ్ ఉసెఫ్ 15-11, 15-6తో గురుసాయిదత్ (ముంబై)పై గెలుపొందాడు. దాంతో ఢిల్లీ ఏసర్స్ జట్టుకు రెండు పాయింట్లు వచ్చాయి. ఫలితంగా ఓవరాల్ గా ఢిల్లీ 4-3 పాయింట్ల తేడాతో ముంబై రాకెట్ ను ఓడించి విజేతగా నిలిచింది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more