పీవీ సింధు మరోసారి సత్తాచాటింది. మకావు ఓపెన్ హ్యాట్రిక్ టైటిల్ తో గతేడాదిని గ్రాండ్‌గా ముగించిన ఈ హైదరాబాదీ ఏస్..తాజాగా మలేసియా మాస్టర్స్‌లో చాంపియన్‌గా నిలిచి ఈ సీజన్‌కూ ఘనంగా స్వాగతం పలికింది. రెండోసారి ఈ టైటిల్‌ను కొల్లగొట్టిన సింధు ఓవరాల్‌గా కెరీర్లో ఐదో గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్‌ను అందుకుంది. సెమీస్‌లో టాప్ సీడ్ సంగ్ జీ హ్యూన్‌ను చిత్తుచేసిన సింధు ఫైనల్లోనూ అంతేదీటుగా విజృంభించింది. ప్రత్యర్థి క్రిస్టీ గిల్మోర్కు అవకాశమివ్వకుండా అలవోకగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ముఫ్పై రెండు నిమిషాల పాటు సాగిన ఏకపక్ష పోరులో మూడోసీడ్ సింధు పదునైన స్మాష్‌లకు తోడు దీటైన నెట్‌గేమ్‌తో చెలరేగింది. తొలిగేమ్‌లో ఓ మోస్తరు పోటీనిచ్చినట్లు కనిపించిన గిల్మోర్, రెండోగేమ్‌లో మాత్రం సింధు ధాటికి ఏ దశలోనూ నిలవలేకపోయింది.
ఇది తనకు అద్భుత విజయం అని... ఈ సీజన్‌కు గొప్ప ప్రారంభం అని సింధూ ఆనందం వ్యక్తం చేసింది. టోర్నీ ఆద్యంతం బాగానే ఆడానని.. అందుకే ఫైనల్ కు ముందు కూడా ఒత్తిడికి గురవలేదని వెల్లడించింది. అయితే, ఫైనల్ ఇంత సులువుగా నెగ్గుతానని అనుకోలేదని.. . ప్రత్యర్థి క్రిస్టీ గిల్మోర్ గతంలో నన్ను ఓసారి ఓడించిందని. దాంతో హోరాహోరీ తప్పదనుకున్నానని తెలిపింది. ఏదేమైనా, సీజన్ ప్రారంభంలోనే టైటిల్ నెగ్గడం తనకు ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని వెల్లడించింది. తర్వాతి టోర్నీలైన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రీ, ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది అని సింధూ ధీమా వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more