Lionel Messi equals record as Argentina thump Venezuela to set up USA clash

Messi ties batistuta s argentina goal record

record goal, Copa America 2016,Copa América,Lionel Messi,Football,Argentina,Venezuela,Sport,US sports

Lionel Messi scored one and created two in his first Copa America Centenario start to lead Argentina to a 4-1 win over Venezuela – and into a semi-final against the United States.

దూసుకెళ్లిన పుట్ బాల్ దిగ్గజం.. వెనిజులాతో..

Posted: 06/19/2016 12:24 PM IST
Messi ties batistuta s argentina goal record

కోపా అమెరికా కప్ ఫుట్బాల్ టోర్నిలో అర్జెంటీనా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో వెనిజులాను 4-1 తో ఓడించింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ రికార్డ్ గోల్ తో వెనిజులాను ఇంటిదారి పట్టించాడు. ఈ బార్సిలోనా సూపర్ స్టార్ ఆట 60 నిమిషంలో గోల్‌ సాధించాడు. ఈ టోర్నమెంట్ అతడు చేసిన నాలుగో గోల్ ఇది. 54 అంతర్జాతీయ గోల్స్ తో గాబ్రియల్ బాటిస్టుటా రికార్డును సమం చేశాడు.

ఆట ఆరంభం నుంచి వెనిజులాపై అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆట ద్వితీయార్థంలో ఎరిక్ లమేలా గోల్ కొట్టాడు. గొంజాలో హిగారియన్ రెండు గోల్స్  చేశాడు.కాగా, అత్యధిక గోల్స్ రికార్డును సమం చేయడం పట్ల మెస్సీ సంతోషం వ్యక్తం చేశాడు. దీని కంటే మ్యాచ్ గెలవడమే తనకు ఎక్కువ సంతోషం కలిగించిందన్నాడు. టైటిల్ దక్కించుకోవడమే తన ముందు లక్ష్యమని చెప్పాడు. గతేడాది ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోయింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lionel Messi  Copa America Cup  record goal  

Other Articles