సాకర్ అభిమానులకిది చేదువార్త. ప్రపంచ సాకర్ స్టార్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. చిలీతో జరిగిన కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోయిన వెంటనే అంతర్జాతీయ సాకర్ నుంచి రిటైరవుతున్నట్టు 29 ఏళ్ల మెస్సీ ప్రకటించాడు. ‘ఇది క్లిష్టమైన సమయం. అర్జెంటీనా తరపున కెరీర్ ముగిసిందని భావిస్తున్నా’ అని అన్నాడు. కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 2-4 గోల్స్ తేడాతో చిలీ చేతిలో ఓటమి చవిచూసింది. జట్టును గెలిపించడంలో మెస్సీ విఫలమయ్యాడు.
కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నమెంట్ తుది పోరులో అర్జెంటీనాను విజేతగా నిలపడంలో విఫలమైన ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ ఆవేదన వ్యక్తం చేశాడు. అర్జెంటీనాకు కప్ సాధించి పెట్టాలని శతవిధిలా తనవంతు ప్రయత్నం చేసినా, అది సాధ్యం కాలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. మ్యాచ్ ఓటమిపై విశ్లేషించే సమయం కాకపోయినా, గెలుపు సాధించడం కష్టంగా మారిందన్నాడు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఫుట్ బాల్ కెరీర్కు వీడ్కోలు చెప్పినట్లు మెస్సీ తెలిపాడు. ఇక జాతీయ జట్టుతో ఆడనందుకు బాధగా ఉన్నా ఓటమికి నైతిక బాధ్యతగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు. ' జట్టును కోపా అమెరికా చాంపియన్గా నిలుపుదామని ప్రయత్నించా. అయితే అది జరగలేదు. ఓటమికి బాధ్యత నాదే. ఇక అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్లో కనిపించను. ఎంతో ముఖ్యమైన పెనాల్టీ షూటౌట్ను సాధించలేకపోయా. దీంతో జట్టుకు ఓటమి తప్పలేదు 'అని మ్యాచ్ అనంతరం మెస్సీ పేర్కొన్నాడు.
ఇవాళ జరిగిన కోపా ఫైనల్ పోరులో చిలీ 4-2 తేడాతో అర్జెంటీనాను ఓడించింది. తద్వారా వందేళ్ల సుదీర్ఘ చరిత్రలోభాగంగా నిర్వహించిన ఈ కప్ను చిలీ సగర్వంగా వరుసగా రెండోసారి అందుకుంది. 2015లో కూడా చిలీ చేతిలోనే అర్జెంటీనా ఓటమి పాలైంది. అప్పుడు కూడా పెనాల్టీ షూటౌట్లోనే చిలీ జయకేతనం ఎగురువేసింది. ఆనాటి ఫైనల్లో చిలీ 4-1 తేడాతో విజయం సాధించగా, ఈ ఏడాది పోరులో 4-2 తో గెలిచింది. ఈ రెండు సార్లు అర్జెంటీనా కెప్టెన్గా మెస్సీని ఉండటం గమనార్హం.క్లబ్ జట్టు బార్సిలోనాకు ఎన్నో ట్రోఫీలు అందించిన మెస్సీ.. అర్జెంటీనా కేవలం రెండు ప్రధాన ట్రోఫీలను సాధించడంలో మాత్రమే మెస్సీ భాగస్వామి అయ్యాడు. అండర్-20 వరల్డ్ కప్, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని సాధించిన అర్జెంటీనా జట్టులో మాత్రమే మెస్సీ పాలు పంచుకున్నాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more