confident of winniing atleast bronze in rio games says vikas krishan

Confident of winniing a medal in rio olympics says vikas krishan

rio 2016 olympics, rio 2016, olympics 2016, rio olympics, vikas krishan, boxing, vikas krishan olympics, rio olympics, vikas krishan boxer, boxing news, olympics news

Vikas Krishan won the right to participate in his second Olympics after reaching the semifinal of the 2016 AIBA World Olympic Qualifying Tournament.

రియో ఒలంపిక్స్ తో తప్పక పతకం సాధిస్తా..

Posted: 06/28/2016 06:18 PM IST
Confident of winniing a medal in rio olympics says vikas krishan

త్వరలో బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్లో పతకం సాధిస్తానని భారత బాక్సర్ వికాస్ క్రిషన్ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ప్రపంచ క్వాలిఫయింగ్ పోటీలో వికాస్ క్రిషన్(75కేజీ) సెమీస్ కు చేరి రియో అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే రియోలో కూడా పతకం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేశాడు.  ' నాకు రియోలో పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. కనీసం కాంస్య పతకమైనా సాధిస్తా. రెండు బౌట్లు గెలిస్తే కాంస్య పతకం గెలిచే అవకాశ ఉంది. నా వరల్డ్ ర్యాంకింగ్ను బట్టి రియోలో డ్రా కూడా నాకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నా. తొలి రెండు బౌట్లలో కఠినమైన ప్రత్యర్థులు ఎదురుపడకపోవచ్చు.

ఇదే కేటగిరిలో గతంలో విజేందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. కనీసం కాంస్య పతకాన్ని సాధిస్తానని నాకు కూడా బలమైన నమ్మకం ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్లో పతకం సాధించలేకపోయా. ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చిన అవకాశాన్ని వదులుకోను. పతకం సాధించడానికి శతవిధిలా ప్రయత్నిస్తా' వికాస్ క్రిషన్ తెలిపాడు. తాను రియో ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తానని తొలుత అనుకోలేదన్నాడు. వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలకు తీవ్రమైన ఒత్తిడిలో సన్నద్దమయ్యానని, ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా శ్రమించానన్నాడు.  దీంతో ఫలితాన్ని సాధించానన్నాడు. ఈ పోరులో  మూడు బౌట్లను ఏకపక్షంగా గెలిచి సత్తాచాటడంతో తనపై నమ్మకం పెరిగిందన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikas Krishan  Rio olympics  indian boxing  

Other Articles