Usain Bolt named to Olympic team despite injuries at trials

Usain bolt on jamaican list for rio 2016 olympics

Jamaica chetah, Usain Bolt, Jamaica, rio olympics, sprinter, Rio Olympics 2016, Usain Bolt, Athletics, Brazil

Only three runners can represent Jamaica in each event at Brazil, leaving the final decision to team management in Rio to choose the final lineup.

రియో ఒలంపిక్స్ కు జమైకా చిరుత

Posted: 07/09/2016 07:40 PM IST
Usain bolt on jamaican list for rio 2016 olympics

రియో ఒలింపిక్స్ కు వెళ్లే జమైకా జట్టులో ఆ దేశ స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ కు స్థానం కల్పించే అవకాశాలు కనబడుతున్నాయి. రియోకు వెళ్లే జమైకా జట్టును సోమవారం ప్రకటించనున్న నేపథ్యంలో ఈ స్టార్ స్ప్రింటర్ పేరు ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది.  జమైకా ఒలింపిక్ ట్రయల్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన 100మీ. సెమీఫైనల్ హీట్‌ను 10.04 సెకన్లలో ముగించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ రేసు అనంతరం బోల్ట్ మోకాలు పైభాగంలో అసౌకర్యానికి గురయ్యాడు.

బోల్ట్ తొడ కండరం నొప్పిని గ్రేడ్-1గా వైద్యులు నిర్ధారించారు. దీంతో రియోకు బోల్ట్ దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కాగా, తాను రియో ఒలింపిక్స్లో పాల్గొనడానికి ప్రస్తుత గాయం ఏమాత్రం అడ్డుకాబోదని బోల్ట్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రియోకు వెళ్లే జమైకా జట్టులో బోల్ట్ పేరును పరిగణించాలని ఆ దేశ ఒలింపిక్ సంఘం నిర్ణయించింది.  అయితే దీనికి ముందు లండన్ లో జరిగే యూనివర్శల్ గేమ్స్లో బోల్ట్ పాల్గొని రియోకు అర్హత సాధించాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jamaica chetah  Usain Bolt  Jamaica  rio olympics  sprinter  Rio Olympics 2016  Usain Bolt  Athletics  Brazil  

Other Articles