Rousing welcome for Rio bronze-medalist Sakshi Malik

Haryana honours daughter sakshi malik

sakshi malik, sakshi malik haryana, sakshi malik award, sakshi malik cheque, sakshi malik crore, sakshi malik village, sakshi malik olympics, sakshi malik bronze medal, sports, sports news

Sakshi Malik touched down in the capital in the wee hours and was received by the Ministers of the ruling Bharatiya Janata Party in Haryana.

12 ఏళ్ల కఠోర శ్రమ ఫలితమే కాంస్య పతకం: సాక్షి

Posted: 08/24/2016 06:35 PM IST
Haryana honours daughter sakshi malik

ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించిపెట్టాలన్న తన కలం సాకారమైందని మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపింది. దీని కోసం గత 12 ఏళ్లుగా శ్రమిస్తున్నానని చెప్పింది. రియో ఒలింపిక్స్ భారత్‌కు తొలి పతకం అందించిన సాక్షి మాలిక్ బుధవారం ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తనను ఘనంగా స్వాగతించడం పట్ల సాక్షి మాలిక్ సంతోషం వ్యక్తం చేసింది. ఇదో అద్భుతమైన అనుభవమని వ్యాఖ్యానించింది. దేశానికి పతకం సాధించిపెట్టడం గర్వకారణంగా ఉందని పేర్కొంది.

విమానాశ్రయంలో ఇంత ఘనంగా తన కుమార్తెకు స్వాగతం లభిస్తుందని ఊహించలేదని ఆమె తండ్రి సత్బీర్ అన్నారు. ఇది గర్వించదగ్గ క్షణమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా మొఖ్రా ఖాస్ గ్రామంలోని తన ఇంటికి సాక్షి మాలిక్ చేరుకుంది. ఇక్కడే భారీ జనసమూహం మధ్య ఆమెకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సన్మానం చేయనున్నారు.  అయితే ఒలింపిక్ పతకాలు సాధించడం అంటే చిన్న విషయం కాదు. దాని వెనుక కఠోర శ్రమ ఉంటుంది, అపారమైన త్యాగాలుంటాయి.. చివరకు తమకు ఎంతో ఇష్టమైన తిండి కూడా తినలేక కడుపు మాడ్చుకోవాల్సి ఉంటుందని అమె అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rio Olympics  Sakshi Malik  grand welcome  Delhi Airport  olympic medal winner  

Other Articles