రియో ఒలింపిక్స్ సందర్భంగా తనతో పాటు కొంతమంది అమెరికా స్విమ్మర్లు దోపిడీకి గురయ్యామంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన ర్యాన్ లోక్టేపై పది నెలల నిషేధం పడింది. తక్షణమే అమల్లోకి వచ్చే ఈ నిషేధం వచ్చే సంవత్సరం మధ్య వరకూ కొనసాగనున్నట్లు యూఎస్ పత్రిక పేర్కొంది. అయితే ఈ ఉదంతంలో ఇరుక్కున మరో ముగ్గురు స్విమ్మర్లపై నాలుగు నిషేధం మాత్రమే విధిస్తూ యునైటెడ్ స్టేట్స్ ఒలింపిక్ కమిటీ(యూఎస్ఓసీ) నిర్ణయం తీసుకున్నట్లు ఆ పత్రిక పేర్కొంది.
ఈ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన లోక్టే.. ఆ మెగా ఈవెంట్ సందర్భంగా తనతో పాటు, ముగ్గురు సహచర స్మిమ్మర్లు ఓ రాత్రి కారులో వెళుతున్నప్పుడు కొంతమంది దుండగులు అడ్డగించి తమ వద్దనున్న కొన్ని విలువైన వస్తువులు దోచుకెళ్లారంటూ ఆరోపించాడు. దీనిపై సీరియస్‌గా స్పందించిన బ్రెజిల్ అధికారులు విచారణ చేపట్టగా, లోక్టే తప్పుడు ఫిర్యాదు చేసినట్లు రుజువైంది. లోక్టే చేసిన ఆరోపణల్ని కట్టుకథగా నిరూపించడంతో అతను భారీ జారీమానా చెల్లించుకోవాల్సివచ్చింది..దాంతో పాటు పలు వాణిజ్య సంస్థలు లోక్టేతో స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more