Sindhu and Saina storms into world semis చరిత్రను సృష్టించి.. తిరగరాసేందుకు కదం తోక్కుతున్నారు..

Pv sindhu storms into world semis saina nehwal too joins

world badminton championships, Saina Nehwal, Sun Yu, PV Sindhu, Pusarla Venkata Sindhu, Kidambi Srikanth, Carolina Marin, badminton news, sports news, latest sports news, badminton

Saina Nehwal gave herself yet another hard-fought win over local favourite, Kirsty Gilmour, to enter semi finals in the Total Badminton World Championships along with Sindhu who reached semis and assure herself of her third World Championships medal.

చరిత్రను సృష్టించి.. తిరగరాసేందుకు కదం తోక్కుతున్నారు..

Posted: 08/26/2017 12:36 PM IST
Pv sindhu storms into world semis saina nehwal too joins

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్లు చరిత్ర సృష్టించారు. తెలుగు తేజం.. రియో ఒలంపిక్స్ రజతపతక విజేత పీవీ సింధూకు తోడు స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ కూడా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్ షిప్ సెమీస్ లోకి దూసుకె్ళ్లి భారత్ ఖాతాలో వీరిద్దరు పతకాలను ఖాయం చేసుకున్నారు. లోకల్ ప్లేయర్‌, 16వ సీడ్ క్రిస్టీ గిల్ మోర్ తో జరిగిన క్యార్టర్ ఫైనల్ మ్యాచులో సైనా 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించి సెమీస్ లోకి అడుగుపెట్టింది.

సుమారు గంట 14 నిమిషాల పాటు జరిగిన ఈ హోరాహోరి పోరులో 21-18తో మొదటి గేమ్ ను గెలిచిన సైనా, 18-21 తేడాతో రెండో గేమ్‌ను కోల్పోయింది. నిర్ణయాత్మకమైన మూడో గేమ్ లో 21-15తో సత్తా చాటి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సెమీస్ కు దూసుకెళ్లింది. కాగా క్రితం రోజు జరిగిన మ్యాచులో పీవీ సింధు కూడా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్ షిప్ సెమీస్‌కు దూసుకెళ్లింది.

క్వార్టర్ ఫైనల్స్ లో భారత బ్యాడ్మింటన్‌ షట్లర్ పీవీ సింధు అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి చైనా షట్లర్ సన్ యూపై 21-14, 21-9తో సింధు గెలుపొందింది. దీంతో సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ సెమీస్ లోకి చేరింది. సెమీస్ కు చేరిన పీవీ సింధుకు పతకం ఖాయం చేసుకుంది. గతంలో రెండు సార్లు వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ షిప్ లో కాంస్యం అందుకున్న సింధూ.. మచ్చటగా మూడో సారి పతకం ఖాయం చేసుకుంది. ఇవాళ రాత్రి జరిగే సెమీస్ లో వీరు విజయం సాధించిన పక్షంలో అదివారం ఫైనల్స్ లో వీరిద్దరే ప్రత్యర్థులుగా ఫైనల్స్ చేరుకుని చరిత్రను తిరగరాయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles