టీమిండియా ఫుట్ బాల్ జట్టు ప్రతిషాత్మకమైన ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ కప్ ను కైవసం చేసుకుంది. ఫైనల్లో కెన్యాపై టీమిండియా జట్టు అద్భుతంగా రాణించి విజయాన్ని అందుకోవడంతో పాటు టైటిల్ ను కూడా సోంత చేసుకుంది. టీమిండియా కెప్టెన్ సునీల్ చెత్రీ రెండు గోల్స్ చేయడంతో పాటు.. డిఫెండర్లు మెరుగైన ప్రదర్శనతో అద్భుత విజయం భారత్ సోంతమైంది. అయితే ఈ మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్(8వ, 29వ నిమిషాల్లో) కెప్టెన్ చెత్రీ చేసినవే. ఇక దీంతో టీమిండియా కెప్టెన్ చత్రి చేసిన గోల్స్ తో ఏకంగా ఫుట్ బాల్ దిగ్గజ అటగాడు మెస్సీ సరసన స్థానం సంపాదించాడు.
అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచులో ప్రత్యర్థి కెన్యా ఖాతా కూడా తెరవనీయకుండా టీమిండియా డిఫెండర్లు బాగా రాణించారు. చెత్రీ ఎనిమిదో నిమిషంలో థాపా నుంచి పాస్ ను అందుకుని గోల్ కొట్టాడు. ఇక 29వ నిమిషంలో సెంటర్ బ్యాక్ నుంచి వచ్చిన పాస్ ను కాలితో గోల్ పోస్టులోకి పంపాడు. దీంతో విరామానికి ముందే భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక రెండో భాగంలో భారత గోల్ కీపర్లు కెన్యా గోల్స్ ను అడ్డుకోవడంతో.. కెన్యా జట్టు ఒక్క గోల్ కూడా చేయలేదు. దీంతో భారత్ చేతిలో 2-0తో ఓటమిపాలయింది.
ఈ టోర్నీ మొత్తంలో భారత్ తరఫున మొత్తం 11 గోల్స్ నమోదయ్యాయి. అందులో చెత్రీ ఒక్కడే 8 గోల్స్ చేసాడు. ఈ మ్యాచ్ లో రెండు గోల్స్ తో మెరిసిన కెప్టెన్ చెత్రీ అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ సరసన చేరాడు. మెస్సీ 124 మ్యాచ్‌ల్లో 64 గోల్స్ చేయగా.. చెత్రీ 102 మ్యాచ్‌ల్లోనే 64 గోల్స్ చేసాడు. పోర్చుగల్ స్టార్ రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. రోనాల్డో 150 మ్యాచ్‌ల్లో 81 గోల్స్ సాధించాడు. ఇక చెత్రితో పాటు తన జట్టు కూడా కొంత సమయాన్ని ఎంజాయ్ చేస్తుందని.. ఆ తరువాత మళ్లీ రీయూనియన్ అవుతుందని అన్నారు.
ఈ మేరకు మ్యాచు గెలిచిన అనంతరం ఆయన భారత క్రీడాభిమానులకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరోమారు ట్వీట్ చేశాడు. ఈ విజయం భారత క్రీడాభిమానులదని అయన వ్యాఖ్యానించాడు. తన విజ్ఞప్తితో స్టేడియంకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చి.. మ్యాచులను వీక్షించిన అభిమానులతో పాటు ఇళ్లలో నుంచి మ్యాచులను లైవ్ లో వీక్షించిన అభిమానుల వల్లే ఈ విజయం సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇక తన తదుపరి టార్టెట్ చాలా సుదీర్ఘమైనదని అది ఛాంఫియన్స్ గా అవతరించడమేనని ట్వీట్ చేశాడు చత్రి. ఇక చత్రి అండ్ టీమ్ పై బాలీవుడ్ బిగ్ బి నుంచి మొదలు అనేక మంది నెట్ జనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
What a feeling! Thank you, India! This win is for the fans who filled the stands, cheered from home and backed and believed in us. The boys and staff pulled together and now it’s time to enjoy. We regroup soon because the road is long - very long. #Champions pic.twitter.com/xar3pR9Ki0
— Sunil Chhetri (@chetrisunil11) June 10, 2018
T 2833 - Congratulations Indian Football Team for winning the Hero International tournament beating Kenya 2-0 ; the defending in the 2nd hald was astounding .. pic.twitter.com/DBuUhrCo1W
— Amitabh Bachchan (@SrBachchan) June 10, 2018
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more