ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ లో స్వర్ణం సాధించి తొలి భారత అథ్లెట్ గారికార్డు సృష్టించిన స్వప్న బర్మన్ తన గెలుపుతో తన గ్రామానికి కూడా మంచి చేసింది. దవడ నొప్పితో భాధపడుతూ కూడా తన లక్ష్యాన్ని చేరుకోవాలన్న కాంక్షతో స్టిక్కర్ వేసుకొని మరీ ఆడిన తన పసిడి స్వప్నాన్ని నిజం చేసుకుంది. ఆసియాడ్ క్రీడలను ముగించుకుని వచ్చిన స్వప్నకు ఆ ఊరి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇది సరే అమె తన గ్రామానికి ఎలా ఉపకారం చేసింది అంటారా.?
అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్న మాదిరిగానే తన గ్రామానికి కూడా కనీసం సరైన రోడ్డు కూడా లేదు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కూడా అరకొరే. అయితే, స్వర్ణం గెలిచిన సందర్భంగా స్వప్నను పలకరించడానికి వచ్చే వీఐపీలందరూ స్వప్న ఇంటి ముందు రోడ్డు పరిస్థితి చూసి చలించిపోయారు. ఈమెంత పేదరికం అనుభవిస్తుందో గ్రహించారు. దీంతో ఆమె ఊరికి వెంటనే కాంక్రీటు రోడ్డును మంజూరు చేశారు. పశ్చిమ బంగలోని జల్ పాయ్ గురి పట్టణానికి శివారులో ఉన్న ఘోస్పారా స్వప్న సొంత ఊరు.
ఇక్కడ నివసించే వాళ్లందరూ టీ గార్డెన్స్ లో పనిచేసేవాళ్లే. ఈ ఊరి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. అయితే, స్వప్న స్వర్ణం గెలిచిన తర్వాత ఆ ఊరి రూపు రేఖల్లో మార్పు వస్తోంది. స్వప్న కోసం వచ్చిన ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆ ఊరిని బాగు చేస్తామని ఆమెకు మాటిచ్చారు. దీంతో తొలుత కాంక్రీటు నిర్మాణానికి పూనుకున్నారు. అనంతరం ఆ ఊరికి తాగునీటి సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి అధికారులు చొరవ చూపుతున్నారు. పసిడే కాదు తమ గ్రామస్వరూపాన్ని కూడా స్వప్న మారుస్తుదని గ్రామస్థులు అమెను కొనియాడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more