టాలీవుడ్ హీరోయిన్ కాజల్ ఇప్పుడు ఎదురుచూపులు చూస్తుంది. అంటే టాలీవుడ్ సినిమా అవకాశాల కోసం కాదులేండి. కాజల్ చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి ఈ నెల 28న జరగనుంది. తన చెల్లి పెళ్లి అయిన వెంటనే కాజల్ కూడా పెళ్లి చేసుకోవటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కాజల్ అగర్వాల్ ఈ నెల్ 28వ తేది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆరోజే తన చెల్లి నిషా అగర్వాల్ కు ముంబైకు చెందిన వ్యాపారవేత్త కరణ్ వలేచ తో వివాహం జరగనుంది.
“నా ప్రియమైన చెల్లలు తనకు తగిన వరుడిని ఎంపిక చేసుకునే అంత పెద్దది అయిపొయింది. ఈ నెల 28న ముంబైలో వివాహం చేసుకోనుంది. నాకు, నా కుటుంబ జీవితంలో ఇదో మరిచిపోలేని రోజు. ఈ శుభసందర్భంలో మా మీద వెలకట్టలేని ప్రేమను చూపించినందుకు మీకు నా ధన్యవాధాలు” అని కాజల్ ఎఫ్.బి పేజి ద్వారా తెలిపింది
ఈ పెళ్లి ప్రైవేటు ఫంక్షన్ గా జరగనుంది. కాజల్ ఇప్పటివరకూ ఏ కొత్త తెలుగు సినిమాను అంగీకరించలేదు. ఆమె నటించిన ‘జిల్లా’ సినిమా 2014 జనవరిలో విడుదలకానుంది
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more