యాడ్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన మ్యూజిక్ డైరెక్టర్ మొహమ్మద్ ఘిబ్రన్.. తమిళంలో రెండుమూడు చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. అక్కడ అవి సక్సెస్ అయిన నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ఇతనికి ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే యూవీ క్రియేషన్స్ తెరకెక్కించిన ‘రన్ రాజా రన్’ సినిమా ద్వారా ఘిబ్రన్ తెలుగులో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకి ఇతను అందించిన సరికొత్తగా వుండటంతో ప్రేక్షకుల ఆదరణ బాగానే లభించింది. పైగా.. ఇతని మ్యూజిక్ సినిమాకు హైప్ కావడంతో ఘిబ్రన్ క్రేజ్ ఆ ఒక్క సినిమాతోనే పెరిగింది. దీంతో యూవీ క్రియేషన్స్ అతనికి మరో అవకాశం ఇచ్చింది. ఆ సంస్థ తెరకెక్కించిన ‘జిల్’ మూవీకి ఇతనే సంగీతం అందించాడు. ఆ మూవీకి వెస్ట్రన్ మ్యూజిక్ తో అలరించాడు.
ఇదిలావుండగా.. తాజా సమాచారం ప్రకారం కొందరు తెలుగు ఫిలిం మేకర్లు రూపొందనున్న భారీ బడ్జెట్ సినిమాల కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా ఘిబ్రన్ ను ఎంచుకున్నారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతమున్న ట్రెండ్ కి తగ్గట్టు ఇతను ట్యూన్స్ అందిస్తుండటంతో చాలామంది తెలుగు డైరెక్టర్లు ఇతనికోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. క్రేజ్ వున్న సంగీత దర్శకులకు ధీటుగా సంగీతం అందిస్తూ ముందుకు దూసుకుపోతున్న ఘిబ్రన్.. తనకు అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని త్వరలోనే టాప్ సంగీత దర్శకుల జాబితాలోకి చేరిపోతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఘిబ్రన్ చేతిలో మూడు సినిమాలు వున్నాయి. అవి కూడా లోకనాయకుడు కమల్ నటిస్తున్న ‘విశ్వరూపం 2’, ‘ఉత్తమ విలన్’, ‘పాపనాశం’ చిత్రాలు కావడం విశేషంగా మారింది. వీటిల్లో ఇప్పటికే ‘ఉత్తమ విలన్’ మూవీ పాటలు విడుదలయ్యాయి కూడా! ఆ సినిమాలోని పాటలన్నీ చాలా క్లాసిక్ గా వున్నాయని, వినసొంపుగా వున్నాయంటూ ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. ఇక రానున్న మిగతా రెండు సినిమాలకు ఘిబ్రన్ సంగీతం ఎలా వుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more