వివాదాలకు మారుపేరుగా నిలిచిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. నిత్యం మాఫియా, దెయ్యాలు, ఫ్యాక్షనిస్ట్ కథలతో కూడిన సినిమాలనే తెరకెక్కిస్తుంటారు. అటువంటి సినిమాల్లో కాస్త రొమాంటిక్ యాంగిల్ ని కూడా జోడిస్తారు కానీ.. అందుకు ఆ చిత్రంలో అంతగా ప్రాధాన్యత వుండదులెండి! ఎందుకంటే.. సబ్జెక్ట్ మొత్తం మాఫియా మీదే నడుస్తుంది కాబట్టి.. రొమాన్స్ అన్నది ఆయా చిత్రాల్లో కేవలం ఒక చిన్న భాగం లాంటిదని పట్టించుకోరు. అంటే.. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో జనాలను టెన్షన్ పెట్టేసిన వర్మ.. ఇప్పుడు రొమాన్స్ ప్రధాన రసంగా చిత్రంతో ప్రేక్షకుల్ని పిచ్చెంకించేందుకు సిద్ధమవుతున్నారు.
రాంగోపాల్ వర్మ ప్రస్తుతం తాజాగా తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం ‘365 డేస్’. ఇందులో నందు, అనైకా సోఠి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ముందుగా మే 15న విడుదల చేయబోతున్నట్లుగా వర్మ కొద్ది రోజుల క్రితమే ప్రకటించాడు కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని మే 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా నిర్మాత డి.వెంకటేష్ వెల్లడించారు. చాలాకాలం తర్వాత వర్మ పూర్తిస్థాయిలో ఈ రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. ప్రేమలో పడినప్పుడు ఒకరుచేసే పనులు మరొకరికి ఇష్టంగా అనిపిస్తాయి కానీ పెళ్లైన తర్వాత అవి కష్టంగా అనిపిస్తాయి. ఈ సబ్జెక్ట్ తో వర్మ చిత్రాన్ని బాగా రూపొందించారని ఆయన అన్నారు.
ఇదిలావుండగా.. అందరికీ ఆశ్చర్యం కలగించే విషయం ఏమిటంటే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యూ’ సర్టిఫికెట్ కేటాయించడం. నిజానికి వర్మ తీసిన చిత్రాల్లో ‘యూ/ఏ’ సర్టిఫికెట్ సాధించిన చిత్రాలు చాలా అరుదు. మిగతావన్నీ ‘ఏ’ లిస్టులోకే వస్తాయి. ఎందుకంటే.. కమర్షియల్ లేదా రొమాంటిక్ సీన్లు ఈయన చిత్రాల్లో రంజుగా వుంటాయి. అలాంటిది.. రొమాంటిక్ ప్రధాన రసంగా తెరకెక్కిన ‘365 డేస్’ చిత్రం ‘యూ’ సర్టిఫికెట్ ఎలా సంపాదించింది? అన్న ప్రశ్న అందరిలో రేకెత్తుతోంది. ట్రైలర్లలోనే రసవత్తమైన సన్నివేశాలతో వర్మ పిచ్చిక్కిస్తే.. ‘యూ’ సర్టిఫికెట్ రావడమేంటి? అని అనుకుంటున్నారు. ఏదేమైనా.. ఈ చిత్రానికి ‘యూ’ సర్టిఫికెట్ ఎలా వచ్చిందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more