ఒకప్పుడు టీమిండియా జట్టులో తన ప్రతిభ చాటుకున్న బౌలర్ శ్రీశాంత్.. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని ఆ ఫీల్డ్ కు దూరమయ్యాడు. తనకు తిరిగి మళ్లీ ఇండియా టీమ్ తరఫున ఆడాలని వుందని ఇతగాడు పేర్కొన్నాడు కానీ.. అది సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తన కెరీర్ ని మెరుగుపర్చుకోవడం కోసం ఇతగాడు మరో ట్రాక్ పై అడుగులు వేశాడు. మొదట్లో కొన్ని టీవీ ప్రోగ్రాంలలో కనువిందు చేసిన ఇతగాడు.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలపైనే తన దృష్టి సారించాడు. ఇతను త్వరలోనే ఓ సినిమాలో నటిస్తున్నట్లు గతకొన్నాళ్ల నుంచి వార్తలొచ్చాయి గానీ.. అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే.. ఇప్పుడు ఇతడో మూవీ చేయనున్నట్లుగా స్పష్టమైంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. శ్రీశాంత్ కథానాయకుడిగా నటించునున్న చిత్రం దర్శకుడు సానాయాదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ దర్శకుడు ఇదివరకే ‘పిట్టలదొర’, ‘బ్యాచిలర్స్’ వంటి సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పుడు మళ్లీ శ్రీశాంత్ తో జతకలిశాడు. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలోనే సాగుతుందని ఆయన పేర్కొన్నాడు. అటు ఈ సినిమా చేస్తున్నందుకు తాను సంతోషంగా వున్నానంటూ శ్రీశాంత్ అంటున్నాడు. తనకి క్రికెట్ లోనే కాకుండా మ్యూజిక్, నాటకాలపైనా మంచి అవగాహనే వుందని, ఆ రెండు ఇప్పుడు తాను తీయబోతున్న చిత్రానికి బాగా హెల్ప్ అవుతాయని తెలిపాడు. ఈ సినిమా బాగా వచ్చేలా తాను శ్రమిస్తానని, మంచి నటుడు అనిపించుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధమని అతగాడు ఛాలెంజ్ చేస్తున్నాడు.
సానాయాదిరెడ్డి, శ్రీశాంత్ కాంబోలో తెరకెక్కనున్న ఈ చిత్రం సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందోనన్న విషయంపై దర్శకనిర్మాతలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులను పలకరించనుంది. మరి.. ఈ చిత్రంతో శ్రీశాంత్ కెరీర్ ఇండస్ట్రీలో పదిలపడుతుందా? లేదా డీలా పడుతుందా? అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more