చిత్రపరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఎందరో ఆశిస్తారు. తమ లక్ష్యాలను పక్కనపెట్టి మరీ ఇండస్ట్రీలోకి అడుగిడుతుంటారు. ఏదైనా ఒక సినిమాలో కనీసం చిన్నపాత్ర లభించిన చాలని ఆశిస్తుంటారు. అలా ఎన్నో ఆశలు పెట్టుకుని ఇప్పటికే పరిశ్రమలో ఎంతోమంది ఆర్టిస్టులు చేరిపోయారు. అలా చేరిన ఆర్టిస్టుల్లోనూ ఓ కోరిక వుంటుంది. ఏదైనా ఒక ప్రత్యేక పాత్రల్లో కనువిందు చేయాలనో, నలుగురిని మెప్పించే రోల్ లో నటించాలనో, తమకి గుర్తింపు తెచ్చే ఒక్క సీన్ లో నటించాలన్న ఆశ వారిలో వుంటుంది. అయితే.. అందుకు తగ్గ ప్రతిభ, స్కిల్స్ వుంటేనే ఆ ఆశలు ఫలిస్తాయి. ఇందుకు నిదర్శనంగా థియేటర్ ఆర్టిస్ట్ సందీప్ భరద్వాజ్ ని తీసుకోవచ్చు.
రంగుల ప్రపంచంలో తన కెరీర్ ని మలుచుకుందామని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సందీప్.. థియేటర్ ఆర్టిస్టుగా స్థానం దక్కించుకున్నాడు. అయితే.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవాలన్న తపన ఇతనిలో మొదలయ్యింది. అప్పటినుంచి అవకాశాల కోసం వెదుకులాట మొదలుపెట్టాడు. తనను ఎవరైనా ఒకరు గుర్తిస్తారని భావించాడు. చివరికి అతని ఆశయం ఫలించింది. అది కూడా ఏదో చిన్నాచితకా దర్శకుడి చేతిలో ఇతడు పడలేదు.. జాతీయ స్థాయిలో పేరుమోపిన రాంగోపాల్ వర్మ కంటికి ఇతడు చిక్కాడు. ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమా తీయాలని నిర్ణయించుకున్న వర్మ.. ‘వీరప్పన్’లా దగ్గరి పోలికలు వున్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి సందీప్ భరద్వాజ్ రూపంలో ‘డూప్లికేట్ వీరప్పన్’ చిక్కాడు. అంతే! ఒక్క మాట ఆలోచించకుండా వర్మ ఈ ఆర్టిస్టును ‘వీరప్పన్’గా మలిచాడు.
ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ సందీప్ భరద్వాజ్.. ‘వీరప్పన్’ పోలికలకు చాలా దగ్గరగా వుంటాడు. దీంతో వర్మ ఇతనిని తన సినిమాలో ప్రధానపాత్రలో నటించే బంపరాఫర్ ఇచ్చేశాడు. ‘వీరప్పన్’ బాడీ లాంగ్వేజ్ కి తగిన నటనను సందీప్ నుంచి వర్మ రాబడుతున్నాడట. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ సినిమాలో పోలీస్ అధికారిగా శివరాజ్ కుమార్ నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషా ప్రేక్షకులను అలరించనుంది. మరి.. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సందీప్ కెరీర్.. ఎలా మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more