‘యుగానికి ఒక్కడు’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ.. ఆ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత అతను నటించిన సినిమాలన్ని తమిళంలోనే కాకుండా తెలుగులో డబ్ అయి, ఘనవిజయాలు సాధించాయి. దీంతో ఈ హీరో తమిళ, తెలుగు భాషల్లో హీరోగా కొనసాగుతున్న వారిలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఈ హీరో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీలో అక్కినేని నాగార్జునతో కలిసి నటిస్తున్నాడు. తెలుగులోనూ కార్తీకి మంచి పేరుండటంతో అతనికి ఈ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చినట్లు ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నారు.
ఇదిలావుండగా.. కార్తీ ప్రస్తుతం ఆనంద హరివిల్లులో తేలియాడుతున్నాడని సమాచారం. అందుకు కారణం ఏమనుకుంటున్నారా? ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం ఈ హీరోకి దక్కింది. దేశంలో గర్వించదగిన దర్శకుల్లో ఒకడైన మణిరత్నం దర్శకత్వంలో నటించాలని స్టార్ హీరోలు సైతం తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వుంటారు. అలాగే కార్తీ కూడా ఓ సందర్భంలో తనకు మణిరత్నంతో కలిసి పనిచేయాలని పేర్కొన్నాడు. ఇప్పుడు ఇన్నాళ్లకు అతని కోరిక నెరవేరడంతో అతని ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయని కోలీవుడ్ వర్గాల్లో చర్చించకుంటున్నారు. వీరిద్దరి మూవీకి సంబంధించి కార్యక్రమాలు ఇప్పటికే మొదలైందని కోలీవుడ్ న్యూస్.
చాలాకాలం తర్వాత ‘ఓకే బంగారం’ సినిమా విజయం సాధించడంతో మణిరత్నం ఆ విజయోత్సాహంలో మరో సినిమాకి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ ప్రాజెక్టుకు ఎంతోమందిని పరిశీలించి చివరికి కార్తీని హీరోగా ఎంచుకున్నాడట. ఈ సినిమా విషయంలో ఇటీవల మణి వెళ్లి కార్తీతో చర్చించగా.. అతడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇంకొక విశేషమేమిటంటే.. కార్తీ తన సినీ కెరీర్ ని మణిరత్నం వద్దే ప్రారంభించాడు. సూర్య హీరోగా మణిరత్నం రూపొందించిన యువ సినిమాకి కార్తీగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా చేసే అవకాశం రావడంతో కార్తీ హర్షం వ్యక్తం చేస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more