2011లో పవన్ హీరోగా వచ్చిన ‘పంజా’ సినిమా గురించి అందరికీ తెలిసే వుంటుంది. ఆమధ్య భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా ఘోరంగా పరాజయం పాలయి, అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. దీంతో.. ఆ సినిమా తెరకెక్కించిన కోలీవుడ్ దర్శకుడు విష్ణువర్ధన్.. మళ్లీ టాలీవుడ్ పై దృష్టి పెట్టలేదు. కానీ.. ఈ ఫెయిల్యూర్ తర్వాత తమిళంలో అతను తీసిన రెండుమూడు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందులో ‘ఆరంభం’ సినిమా వందకోట్ల క్లబ్ లోకి చేరి, విష్ణుకి భారీ విజయాన్ని అందించింది. ఆ సినిమాతో విష్ణు కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అందుకేనేమో.. తెలుగులోనూ తన అదృష్టాన్నీ మరోసారి పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘పంజా’తో ఘోర పరాజయం చవిచూసిన విష్ణు.. పవన్ తోనే మరో సినిమా తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నడట. ఇప్పటికే పవన్ తో మంతనాలు జరిపినట్లు వార్తలొస్తున్నాయి. ఇదివరకెన్నడూలేని సరికొత్త సినిమా లైన్ ని పవన్ కి విష్ణు వినిపించాడని, అది తనకి నచ్చడంతో డెవలప్ చేయమని పవన్ చెప్పాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. నిజానికి.. ఏదైనా ఓ డైరెక్టర్ ఫెయిల్యూర్ అందిస్తే మరోసారి అతనితో కలిసి చేసేందుకు ఏ హీరో ఆసక్తి చూపించడు. కానీ.. పవన్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తాడని మరోసారి నిరూపితమైందని అనుకుంటున్నారు. జయాపజయాలను పక్కన పెడితే, దర్శకులలో గల ప్రతిభను గుర్తించడంలోనూ.. ఛాన్స్ ఇవ్వడంలోనూ పవన్ ఎప్పుడూ ముందే వుంటాడు. అందుకే గతంలో విష్ణు ఇచ్చిన ఫెయిల్యూర్ ని పట్టించుకోకుండా, అతడు చెప్పిన లైన్ విని, దాన్ని డెవలప్ చేయమని చెప్పాడని అంటున్నారు.
ఇక పవన్ తన సినిమాకు ఎలాగో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కాబట్టి.. తాను వినిపించిన ఆ స్టోరీ లైన్ ని డెవలప్ చేసే పనిలో విష్ణు మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథను త్వరలోనే పూర్తి చేసి, షూటింగ్ ప్రారంభించాలనే యోచనలో విష్ణు వున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ పూర్తి కాగానే, ఆ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more