తమిళ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో అజిత్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హీరో అనే గర్వం ఏమాత్రం లేకుండా సాధారణ ప్రజలతో సహా మమేకమయ్యే మంచి మనస్తత్వం కలిగిలిన అజిత్.. ఎవరైనా కష్టాల్లో వుంటే వారిని ఆదుకోవడంలో ఈయనకు ఈయనే సాటి అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. అలాగే.. తీవ్ర ఆర్థిక పరిస్థితుల్లో కూరుకుపోయిన ఓ నిర్మాతను ఆదుకుని, తిరిగి ఆయన్ను ఇండస్ట్రీలో మళ్ళీ గొప్ప నిర్మాతగా నిలబడేలా సహకరించి తన మంచితనాన్ని మరోసారి నిరూపించుకున్నాడు అజిత్.
సూర్య మూవీస్ బ్యానర్ పై తెలుగు, తమిళ భాషల్లో నిర్మాత ఎం.ఎం.రత్నం మంచి కథాబలమున్న ఎన్నో చిత్రాలను నిర్మించి భారీ విజయాలు అందుకున్నారు. ఎందరో హీరోలను స్టార్ స్టేటస్ సాధించేలా సహకరించాడు. అయితే.. ఆ తర్వాత ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు భారీ మొత్తంలో నష్టాలు తెచ్చిపెట్టాయి. దాంతో ఆయన చిత్ర నిర్మాణానికి దూరంగా వుండాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా.. అప్పుడు కూడా తారాస్థాయికి చేరిపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో వుండిపోయారు. ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఎం.ఎం.రత్నం స్థితిగతులను తెలుసుకున్న అజిత్.. ఆయన్ను ఆదుకోవడం కోసం ఆయనతో వరుసగా మూడు సినిమాలు చేశాడు. ఆ సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొంది, ఆ నిర్మాతకు మంచి వసూళ్ళే రాబట్టాయి. దాంతో ఆయన ఆర్థిక సమస్యల నుంచి బయటపడటమే కాదు.. మళ్ళీ భారీ సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగిపోయారు.
రత్నం మంచితనం, సినిమాల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని గమనించిన అజిత్.. ఆయన్న ఆదుకోవడానికి ముందుకొచ్చాడు. అంతేకాదు.. ఆయన నిర్మాణంలో మరో రెండు సినిమాలు చేస్తానని మాటిచ్చాడు కూడా. దాంతో ఆ నిర్మాత ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఏదేమైనా.. అజిత్ చేసిన ఈ మంచిపనికి అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో వున్న నిర్మాతలను ఆదుకోవడంలో అజిత్ ఎప్పుడూ ముందుంటాడని, ఆయన తెరపైనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ‘హీరో’నే అంటూ వారు గర్వంగా చెప్పుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more