మందిరంలో జరిగే కార్యక్రమాలు :
- ఉదయం 4:00 గంటల సమయంలో ఆలయాన్ని తెరుస్తారు.
- 4:15 గంటల సమయంలో భూపాలి కార్యక్రమం చేస్తారు.
- ఉదయం 4:30 నుంచి 5:00 గంటలవరకు కకడ్ ఆర్తి నిర్వహిస్తారు.
- 5:00 గంటల సమయంలో భజన ప్రారంభం అవుతుంది.
- 5.:05 గంటల సమయంలో శిరిడిసాయి బాబాకు మంగళస్నానం చేస్తారు.
- 5.35 గంటల సమయంలో బాబుకు ఆర్తి నిర్వహిస్తారు.
- 5:40 గంటల సమయంలో బాబా సమాధి మందిరంలో దర్శనం మొదలవుతుంది.
- 11:30 గంటల సమయంలో మందిరంలోని ద్వారకామైలో బియ్యం, నెయ్యితో ధుని పూజా చేస్తారు.
- 12:00 నుంచి 12:30 గంటల సమయంలో మధ్యాహ్న ఆర్తి నిర్వహిస్తారు.
- సాయంత్రం 4:00 గంటల సమయంలో బాబా సమాధి మందిరంలో పోతి (భక్తి పాఠాలు చదవడం) కార్యక్రమం నిర్వహిస్తారు.
- సూర్యాస్తమయానికి 20 నిముషాల ముందు ధూప్ ఆర్తి నిర్వహిస్తారు.
- 8:30 నుంచి 9:00 గంటలవరకు బాబా సమాధి మందిరంలో భక్తిరస గీతాలు పాడటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతారు.
- 9:00 గంటల సమయంలో మందిరంలో చావడి, గురుస్థానాలను మూసివేస్తారు.
- 9:30 నిముషాల సమయంలో ద్వారకామయి నీటిని బాబాకు అందజేస్తారు. ఈ సమయంలో ఒక పన్నగపు దోమలతెరను దించుతారు. అలాగే ఓ ద్వీపాన్ని వేలాడదీసి వెలిగిస్తారు.
- 9:45 గంటల సమయంలో ద్వారకామయి (ఉపరితల భాగం)ని మూసివేస్తారు.
- 10:30 నుంచి 10:50 నిముషాల సమయం మధ్యలో షెజ్ (రాత్రి) ఆర్తి చేస్తారు. దీని తర్వాత బాబా సమాధి మందిరాన్ని ఒక తువాలుతో కప్పుతారు. బాబా మెడ దగ్గర ఒక రుద్రాక్ష మాలను ఉంచుతారు. ఇక చివరగా పన్నగపు దోమలతెరను పూర్తిగా క్రిందకు దించి, ఒక గ్లాసు నీళ్లు అక్కడ వుంచుతారు.
- 11:15 నిముషాల సమయంలో ఆర్తి ముగిసిన అనంతరం సమాధి మందిరాన్ని మూసివేస్తారు.
Nov 30 | మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో వుండే నాశిక్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో షిర్డీ అనే ఒక పాత చిన్న గ్రామం వుండేది. అయితే.. ఎప్పుడైతే బాబా ఈ స్థలానికి విచ్చేశారో.. అప్పటి... Read more
Nov 30 | సాయిబాబా విగ్రహాన్ని దర్శింఛి ఆశీస్సులు పొందేందుకు భక్తులు సాధారణంగా తెల్లవారు ఝామునుంచే బారులు తీరుతారు. గురువారాల్లో రద్దీ బాగా వుంటుంది, ఆ రోజు ప్రత్యెక పూజ, బాబా విగ్రహ ప్రత్యెక దర్శనం వుంటాయి. మందిరం... Read more
Nov 30 | శిరిడి సాయి బాబా గుడికి దేశంలోని అన్నిప్రాంతాల నుండి రోడ్డు మార్గం కలదు. ఎ.పి.యస్.ఆర్.టి.సి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు. ప్రెవేటు ట్రావెల్స్ బస్సుల సౌకర్యం కలదు. నాశిక్, పూణే,... Read more
Nov 30 | షిరిడి సాయి బాబా టెంపుల్ కు వెళ్లటానికి దేశంలోనా అన్నీ ప్రధాన నగరాల రైల్వే స్టేషన్ల నుండి రైళ్లు ఉన్నాయి. అయితే శిరిడి సాయి బాబా టెంపుల్ వద్దకు మాత్రం రైలు మార్గం లేదు.... Read more
Nov 30 | శిరిడి సాయి బాబా గుడికి సమీప దగ్గరలో ఉన్న, ముంబాయి, ఔరంగబాద్, పూనే, నాసిక్ విమాశ్రయాలు కలవు. అయితే ముంబాయి ఎయిర్ పోర్టు నుండి శిరిడికి 260 కి.మీ., పూనే నుండి 185 కి.మీ.,... Read more