వేసవికాలంలో చాలామంది ఇంటినుండి బయటకు రావడానికి ఇష్టపడరు. సూర్యుని వేడినుంచి రక్షించుకోవడానికి తమనితాము కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతుంటారు. ఈ కాలంలో సూర్యునినుంచి వెలువడే కొన్ని హానికరమైన కిరణాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
ముఖ్యంగా సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మానికి సంబంధించిన క్యాన్సర్ వ్యాధులను కలుగజేస్తాయి. రానురాను మన వాతావరణ పరిస్థితి విపరీతమైన కాలుష్యాలతో అస్థవ్యస్థమవ్వడం వల్ల, భూమి చుట్టూ ఆవరించి వున్న ఈథర్ పొర కూడా దెబ్బతింటోంది. ఈ ఈథర్ పొర సూర్యుని నుండి వచ్చే కిరణాలను సాధ్యమైనంతవరకు ఆపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ప్రస్తుతకాలంలో ఇది చాలావరకు నశించిపోతోంది.
అదేవిధంగా సూర్యుని వేడి వల్ల వడదెబ్బ వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయి. ఇది ప్రాణాంతకమైన వ్యాధి. ఒకసారి ఈ వ్యాధి బారిన పడినవారు కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఈ వ్యాధి వల్ల చాలామంది ప్రాణాలను కూడా కోల్పోయారు.
కొంతమంది సూర్యునితాపాన్ని తట్టుకోవడానికి ముఖానికి స్కార్ఫ్ లు, గొడుగులు ఇంకా అనేక రకాలైన ప్రయోగాలు చేస్తూ వుంటారు. మరికొందరైతే విచిత్రంగా తమ వాహనాలను విపరీతమైన పద్ధతిలో తయారుచేసుకుని తిరిగేవారు కూడా వున్నారు. అయితే.... ఈ వేసవితాపాన్ని తట్టుకోవడానికి, దీనిద్వారా నుంచి వ్యాధులను అరికట్టేలంటే దానికి కొన్ని చిట్కాలను పాటించడం వల్ల తప్పకుండా ఫలితం దక్కుతుందని నిపుణులు తమ ప్రయోగాల ద్వారా తెలుపుతున్నారు.
ఉదయం ఆఫీసుకు బయలుదేరే సమయం నుండి రాత్రి వరకు ప్రతిఒక్కరు ఈ ఎండ తాకిడికి గురి అవుతారు. పైగా ప్రస్తుతమున్న కాలుష్య వాతావరణంతో ముఖ్యంగా మన కళ్లు చాలా తొందరగా వేడెక్కుతాయి. అప్పుడు మన కళ్లల్లో నుంచి నీరు కారడం మొదలవుతుంది. అటువంటి సమయాల్లో రాత్రి నిద్రపోయేముందు రోజ్ వాటర్ వేసుకుంటే చల్లదనంగా అనిపిస్తుంది. ఇదిలేకుండా కీరకాయ ముక్కలను కట్ చేసి కళ్లపై వుంచుకుంటే చాలా హాయిగా వుంటుంది. అదేవిధంగా పాలనురుగును కూడా కళ్లకు రాసుకుంటే ఎంతో మేలు కలుగజేస్తుంది.
పిల్లల నుంచి పెద్దలవరకు వేడితాపం వల్లే వచ్చే అతిముఖ్యమైన సమస్య చెమట. ఇది సూర్యునివేడివల్ల నిరంతరం మన శరీరంలోనుండి వెలువడుతూనే వుంటుంది. అప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే స్నానం చేసుకునేముందు నీటిలో గులాబీ రేకులను కలుపుకుని స్నానం చేయాలి. ఇది రోజంతా మనం తాజాగా వున్నట్లు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని చేకూర్చుతుంది.
సాధారణంగా చాలామందికి చల్లదనాన్ని చేకూర్చే ఏసీ లేదా కూలర్ వంటి పరికరాలతో అలర్జీగా వుంటుంది. సమ్మర్ లో వాతావరణ వేడి పరిస్థితివల్ల ఇటువంటివారు ఇంటినుండి బయటికి వెళ్లక, ఇంట్లో వున్న వేడిమిని తట్టుకోలేక చాలా అవస్థలు పడుతుంటారు. అలాంటప్పుడు ఇంట్లో వున్న కిటికీలకు వట్టి వేర్లతో వేసిన పరదాలను కట్టుకోవడం వల్ల, ఇంట్లో వున్న వేడిమిని బయటకు పంపించి, చల్లదనాన్ని చేకూరుస్తుంది.
ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు గొడుగుగానీ, ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవడం ఎంతో ఆరోగ్యకరమైన ఆలోచన. దీంతో ఎటువంటి వ్యాధులు మనజోలికి రాకుండా జాగ్రత్త పడవచ్చు.
ఫ్రిజ్ వాటర్ కాకుండా కుండలో వున్న నీటిని తీసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపించండి. ఇది శరీరంలో వున్న వేడిని బయటికి తీయడానికి సహాయపడుతుంది. ఎక్కువగా ఆరోగ్యకరమైన తాజా పండ్లను తీసుకోవడం శ్రేయస్కరం!
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more