వాతావరణ పరిస్థితులు, మారుతున్న జీవన విధానాల కారణంగా ప్రజలు రకరకాల రోగాల బారిన పడుతున్నారు. ఆరోగ్యకరమైన చిట్కాలను ఎన్ని పాటించినప్పటికీ.. కొన్ని సమస్యలు మాత్రం నిత్యం వెంటాడుతూనే వుంటున్నాయి. అటువంటి వాటిల్లో బీపీ (రక్తపోటు) ఒకటి. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే దీని నుంచి ఉపశమనం పొందడం అసాధ్యం. కానీ.. కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిజానికి బీపీని తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నప్పటికీ.. అవి శరీరానికి ఏదో ఒక రకంగా హాని కలిగిస్తాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో శాస్త్రజ్ఞులు బీపీని తగ్గించుకునే సరికొత్త మార్గాలను ప్రవేశపెడుతున్నారు. అవి ఏంటో తెలుసుకుందామా...
ప్రతిరోజూ ఒక యాపిల్‌ను తొక్క తీయకుండా తింటే రక్తపోటును తగ్గించుకోవచ్చని నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. ఎందుకంటే.. యాపిల్ లో ఎన్నోరకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ వంటివి వుంటాయి. అవి బీపీని కంట్రోల్ లో వుంచుతాయి. బీపీను తగ్గించే ఔషధ గుణాలు యాపిల్ తొక్కలో ఆరు రెట్లు ఎక్కువ ఉన్నాయని, కాలంతో సంబంధం లేకుండా దొరికే పండు కనుక రోజుకో యాపిల్ తీసుకోవడం వల్ల బీపీకు చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్యులు. కేవలం ఆపిల్ మాత్రమే కాదు.. గ్రీన్ టీ, బ్లూ బెర్రీస్ తీసుకోవడం వల్ల కూడా బీపీని తగ్గించుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ మూడింటిని రెగ్యులర్ గా తీసుకుంటే.. బీపీ సమస్యను చాలావరకు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more