కొలెస్టిరాల్.. నేటి ఆధునిక యుగంలో ప్రతిఒక్కరిని వేధిస్తున్న సమస్య. ఇది గుండెసంబంధిత సమస్యల్ని మాత్రమే కాకుండా అనేక వ్యాధులకు కారణం అవుతుంది. కాబట్టి.. ఈ సమస్య నుంచి ఎంత వీలైతే అంత త్వరగా బయటపడితే మంచిది. శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొలెస్టిరాల్ ని తగ్గించుకోవాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని సులభ మార్గాల ద్వారా దానిని నివారించవచ్చు. మరి.. అవేంటో తెలుసుకుందామా...
* చేపల్లో ఒమెగా 3 అనే ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది. ఇది రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు చెడు కొలెస్టిరాల్ ని నివారించి, మంచి కొలెస్టిరాల్ పెరిగేలా చేస్తుంది. రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. కాబట్టి.. వారంలో రెండు రోజులు చేపలు తింటే ఎంతో మంచిది.
* గోధుమలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇది చెడు కొలెస్టిరాల్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి. ఫైబర్ కొలెస్టిరాల్‌తో బైండ్ అయి శరీరం నుంచి బయటకు పంపించి వేస్తుంది. ఈ ఫైబర్ గోధుమలోనే కాకుండా ఓట్స్, బార్లీ, రాగి, జోవర్‌లలో కూడా సమృద్ధిగా లభిస్తుంది.
* పాల ఉత్పత్తులో ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ అక్సిడెంట్లు, పాలిఫెనాల్స్ ఉంటాయి. పాలిఫెనాల్స్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా చేస్తాయి. కాబట్టి.. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఎంతో శ్రేయస్కరం.
* ప్రతిరోజూ వంటనూనె ఒకే రకమైంది కాకుండా మార్చుకోవాలి. ఓసారి రైస్‌బ్రౌన్ అయిల్ తీసుకుంటే, మరోసారి గ్రౌండ్‌నట్, సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి.
* ఆలివ్ ఆయిల్‌లో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్టిరాల్‌ను తగ్గిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి.
* వెల్లుల్లిలో ‘ఐసిన్’ అనే యాంటి అక్సిడెంట్ ఉంటుంది. ఇది చెడు కొలెసా్ట్రల్‌ను తగ్గించడంతోపాటు రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడకుండా చేస్తుంది.
* ఆపిల్‌లో ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం, విటమిన్-ఎ, బి, సి ఉంటాయి. అవి కొలెస్టిరాల్ ని తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తాయి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more