ప్రకృతి సహజంగా లభించే దానిమ్మలో ఎన్నో పోషక విలువలు నిల్వవుంటాయి. ఈ దానిమ్మను రెగ్యులర్ గా తీసుకుంటే.. గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందడంతోపాటు నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చు. అలాగే.. చిరుజబ్బుల నుంచి దూరంగా వుండొచ్చు. ఇందులో వుండే న్యూట్రిషన్స్ శరీర అవయవాలను ఉత్తేజితం చేస్తూ, వాటిని ఆరోగ్యంగా వుంచడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అందుకే.. ఈ ఫండును ఆరోగ్యానికి ఔషధంగా పరిగణిస్తున్నారు. వీటిని ప్రతిరోజూ తీసుకోవాల్సిందిగా వైద్యులు కూడా సలహాలు ఇస్తున్నారు. ఈ పండుతో కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
* పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
* దానిమ్మను తీసుకుంటే తరచూ తీసుకుంటే అది శరీరంలో రక్త పరిమాణం పెంచుతుంది.
* ఎనీమియాను తగ్గించి.. అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది.
* గుండె జబ్బులకు దానిమ్మ ఎంతో మేలు చేస్తుంది.
* కడుపులో మంటను తగ్గిస్తుంది.
* నోటి దుర్వాసనను పోగొడుతుంది.
* దానిమ్మ రసంతో పుక్కిలిస్తే నోటి పూత తగ్గుతుంది.
* దానిమ్మ తొక్క నీటిలో ఉడికించగా వచ్చిన ద్రవం తాగితే జీర్ణాశ్రయ క్రిములు నశిస్తాయి.
* దానిమ్మ రసం వల్ల ఉదర సంబంధ రోగాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
* దానిమ్మ తొక్క లోపలి భాగాన్ని నెమ్మదిగా నములుతూ.. ఆ రసాన్ని మింగితే విరేచనాలు తగ్గుముఖం పడతాయి.
* ఉదర సమస్యలకు, అజీర్తికి పనిచేస్తుంది.
* దానిమ్మ పండును నీటిలో నానబెట్టి తేనెలో కలుపుకుని తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు నయమవుతాయి.
* పళ్ళపై ఉండే పాచిని దానిమ్మ పోగొడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావం చూపుతుంది.
* దానిమ్మ గింజలు సులువుగా జీర్ణమవుతాయి. కాబట్టి అన్ని వయసులవారు వీటిని తీసుకోవచ్చు.
* దానిమ్మ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. జ్ఞాపకశక్తిని ఇనుమడింపజేస్తుంది.
* తెలివితేటలు అభివృద్ధి చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more